»   » సల్మాన్ 'ప్రేమ్‌' సాంగ్ కి 'బజరంగీ‌' పాప డాన్స్ (వీడియో)

సల్మాన్ 'ప్రేమ్‌' సాంగ్ కి 'బజరంగీ‌' పాప డాన్స్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌ జంటగా నటిస్తున్న 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రంలో ఓ పాటకి 'బజరంగీ భాయిజాన్‌' చిత్రంలో మున్నీగా నటించిన బాలనటి హర్షాలీ మల్హోత్ర నృత్యం చేసింది.

ఈ చిన్నారి నృత్యం చేస్తున్న వీడియోని సల్మాన్‌ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకుంటూ 'సో స్వీట్‌ మున్నీ..' అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

సూరజ్‌ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం తెలుగులో 'ప్రేమ లీల' అనే టైటిల్‌తో విడుదలకు సిద్ధమౌతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరో ప్రక్క... 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' పాకిస్థాన్‌లోనూ సందడి చేయనుంది. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్‌కు జంటగా సోనమ్‌ కపూర్‌ నటించింది. ఇటీవల విడుదలైన 'బజరంగీ భాయ్‌జాన్‌' సినిమాపై పాకిస్థాన్‌లో ఎన్ని వివాదాలు వచ్చినా సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Harshaali Malhotra dances to ‘Prem Ratan Dhan Payo

దీంతో 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రాన్ని పాకిస్థాన్‌లోనూ విడుదల చేసేందుకు యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. దీపావళి కానుకగా వనంబర్‌ 12 విడుదల కానున్న ఈ చిత్రాన్ని అదే రోజున పాకిస్థాన్‌లోనూ విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌లు ముఖ్యపాత్రల్లో నటించారు.

గతంలో సల్మాన్‌ఖాన్‌తో దర్శకుడు సూరజ్‌ బర్‌జాత్యా మైనే ప్యార్ కియా, హమ్ సాత్ సాత్ హై,హమ్ ఆప్ కే కౌన్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తీశాడు. ఈ కాంబినేషన్ తాజాగా నాలుగోసారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

English summary
Salman Khan took to Twitter to share a video which shows Harshaali Malhotra aping Sonam Kapoor's killer moves from the title track of the upcoming movie 'Prem Ratan Dhan Payo'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu