twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోరిక తీర్చకపోతే టార్చరే.. కమిట్‌మెంట్ అంటే అదే.. రిస్క్ ఎందుకని.. మాధవీలత

    హాలీవుడ్‌‌లో దర్శకుడు వెయిన్‌స్టెయిన్ సెక్స్ కుంభకోణం తర్వాత సినీ తారలు ఒక్కొక్కరు పెదవి విప్పుతున్నారు. హాలీవుడ్‌, బాలీవుడ్‌లోనే కాదు.. అన్ని పరిశ్రమల్లోనూ హీరోయిన్లకు లైంగిక వేధింపులు తప్పవు.

    By Rajababu
    |

    హాలీవుడ్‌‌లో దర్శకుడు వెయిన్‌స్టెయిన్ సెక్స్ కుంభకోణం తర్వాత సినీ తారలు ఒక్కొక్కరు పెదవి విప్పుతున్నారు. హాలీవుడ్‌, బాలీవుడ్‌లోనే కాదు.. అన్ని పరిశ్రమల్లోనూ హీరోయిన్లకు లైంగిక వేధింపులు తప్పవు. అవి లేవంటే ఎవరూ నమ్మరు. తాజాగా 'నచ్చావులే' సినిమాతో నటిగా మారిన తెలుగమ్మాయి మాధవీలత ప్రముఖ యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇటీవల బీబీసీ తెలుగు కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..

    నాకు చిన్నప్పటి నుంచి

    నాకు చిన్నప్పటి నుంచి

    నాకు చిన్నప్పటి నుంచి ఈ రంగంలోకి రావాలని కోరిక ఉండేది. నా కలలను సాకారం చేసుకోవాలనే వచ్చాను. కానీ చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అందరూ చెడ్డవాళ్లని ముద్ర వేయలేను కానీ అత్యధిక శాతం వాడుకోవాలని చూసేవారే.

    కెరీర్ ఆరంభంలో కోఆర్డినేటర్లు

    కెరీర్ ఆరంభంలో కోఆర్డినేటర్లు

    కెరీర్ ఆరంభంలో కోఆర్డినేటర్లు కాల్ చేసేవారు. కొత్తగా ప్రొఫెషనల్‌లోకి వచ్చిన కోఆర్డినేటర్లు చాలా మంచిగా మాట్లాడుతారు. సీనియర్ కోఆర్డినేటర్లు చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు. ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి వేరే సిటీకి వెళ్దాం. ప్రైవేట్‌గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దాంతో మన మధ్య కోఆర్డినేషన్ పెరుగుతుంది. నేను ఆఫర్లు వచ్చేలా చూస్తాను. అది నీకు, నాకు మంచిది అని కోఆర్డినేటర్లు మాట్లాడుతారు.

    పరిశ్రమలో వంద మంది ఉంటే

    పరిశ్రమలో వంద మంది ఉంటే

    సినీ పరిశ్రమలో వంద మంది ఉంటే అందరూ అలా ఉంటారని నేను అనను. నేను 50 మందిని కలిస్తే దాదాపు 40 మంది అలానే ఉంటారు. హీరోయిన్ అంటే ప్రతీ ఒక్కరూ వాడుకోవాలని చూస్తారు. మీరు ఎందుకు నాకు క్లోజ్ ఫ్రెండ్ కాకుడదు అంటారు. ఇలా చాలా సార్లు వేధింపులకు గురయ్యాను. కొన్నిసార్లు మా అమ్మ కూడా బాధపడేది. ప్రతీ సినిమాకు పరిశ్రమను వదిలేద్దామనే ఫీలింగ్‌తో ఉండేదానిని.

    పరిశ్రమలో అందరూ

    పరిశ్రమలో అందరూ

    ఇది ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ కదా.. ఇది లైఫ్ కదా. ఫన్ కదా అని స్మూత్ అని అడుగుతారు. పరిశ్రమలో అందరూ అవకాశవాదులే. ఒక్క రోజులో అయిపోతుంది కాదా. రిస్క్ ఎందుకని కొందరు ఎంజాయ్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకొంటారు. కాదు కూడదు అంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

    తమిళ సినిమా చేసేటప్పుడు

    తమిళ సినిమా చేసేటప్పుడు

    నేను తమిళ సినిమా చేసేటప్పుడు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ పార్టీ జరుగుతుండగా.. ఒకతను వచ్చి.. నేను మీ రూమ్‌కు వస్తాం. ఎంజాయ్ చేద్దామా (వీ విల్ కమ్ టూ యువర్ రూమ్.. వీ విల్ హావ్ ఫన్) అని ఒక మాటే అడుగుతారు. ఇంకే ఏమి జరుగదు. దాంతో బ్యాక్ డోర్ నుంచి మేము పారిపోయాం

    చిన్న సినిమాల్లో పనిచేసేటప్పుడు

    చిన్న సినిమాల్లో పనిచేసేటప్పుడు

    చిన్న సినిమాల్లో, కొత్త హీరోలు, దర్శకులతో పనిచేసేటప్పుడు ఇలాంటి పరిస్థితులు కనిపించవు. అలాంటి పరిస్థితుల్లో మంచి సినిమా తీయాలని దర్శకులకు తపన ఉంటుంది. హీరోయిన్లు మంచి నటన కనబరిస్తే సినిమా బాగా వస్తుంది అని ఆలోచిస్తారు.

    పెద్ద సినిమాలైతే వాళ్లకు

    పెద్ద సినిమాలైతే వాళ్లకు

    పెద్ద సినిమాలైతే వాళ్లకు ఇలాంటి పరిస్థితులు కనిపించవు. పెద్ద ప్రాజెక్టుల్లో పనిచేసే సమయంలో మనం ఎందుకు కలిసి కొంత సమయం ఎందుకు ఎంజాయ్ చేయకూడదు. కాదు అంటే ఆ సినిమా నుంచి తీసేయడమో లేదా మరో ప్రాజెక్టుల్లో వారికి అవకాశాలు ఉండవు. కోఆపరేట్ చేయరు అనే పదం ఇండస్ట్రీలో చాలా పెద్దది. చాలా ప్రభావం చూపిస్తుంది.

    హీరోయిన్‌లను ఎక్కువ శాతం

    హీరోయిన్‌లను ఎక్కువ శాతం

    హీరోయిన్‌లను ఎక్కువ శాతం ఇక్కడ వాడుకోవాలని చూసేవారే ఉంటారు. నాకు క్లోజ్ ఫ్రెండ్‌గా ఉండగలవా? మనం ఫన్నీగా ఉందామా? అంటూ మొదలు పెడుతారు. నేరుగా ఎవరూ ఏమీ అనరు. కానీ ప్రతి సందేశం వెనుకా అదే భావం ఉంటుంది.

    సినిమా ఇండస్ట్రీలో పడక గదికి

    సినిమా ఇండస్ట్రీలో పడక గదికి

    సినిమా ఇండస్ట్రీలో పడక గదికి రమ్మని పిలువడానికి 'కమిట్‌మెంట్' అనే పదం పెట్టుకుంటారు. ఇలాంటి వ్యవహారాల్లో మేనేజర్లది ప్రధాన పాత్ర. ఆఫర్ ఇచ్చేటప్పుడు కమిట్‌మెంట్ ఇస్తారా? అంటూ మేనేజర్లు అడుగుతారు.

    చాలా మంది నిర్మాతలు

    చాలా మంది నిర్మాతలు

    మేము సినిమాకు డబ్బులిస్తున్నాం, మాకేమిటి అని ఆలోచిస్తారు చాలా మంది నిర్మాతలు. ఆ అమ్మాయి అంకిత భావంతో పని చేస్తుందా అని అడుగుతారు, కానీ అంకిత భావం వృత్తికి కాదు, వ్యక్తులకి. ఇది అందరికీ తెలిసిన నిజం. ఎవరూ చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే, చెప్పిన మరుక్షణం అవకాశాలు మాయమవుతాయి.

     నో చెబితే అవకాశాలు రానివ్వకుండా

    నో చెబితే అవకాశాలు రానివ్వకుండా

    ఎవరితోనైనా చెబితే అవకాశాలు రానివ్వకుండా అడ్డుపడుతారు. ఆ అమ్మాయికి పొగరు, మాట వినదు అని ముద్ర వేస్తారు. అస్సలు 'సహకరించదు'. నాట్ కమిటెడ్ అంటారు. ఈ పదాలకు పరిశ్రమలో అర్థాలు వేరు. నాన్ కమిటెడ్ అంటే కమిట్‌మెంట్ ఇవ్వలేదు అని అర్థం.

    పురుషాధిక్యత ప్రపంచంలో

    పురుషాధిక్యత ప్రపంచంలో

    పురుషాధిక్యత ప్రపంచంలో మహిళలు నోరు విప్పి మాట్లాడితే పొగరు, బలుపు అని అంటారు. ఆ అమ్మాయికి యాటిట్యూడ్ అని, డిసిప్లిన్ లేదు అని ముద్రవేస్తారు. అవకాశాలు ఇవ్వడానికి నిరాకరిస్తారు.

    English summary
    After Harvey Weinstein sex scandal broke out, many celebraties like Radhika Apte, Kasthuri, Rakul Preet Singh, Archana, Varalakshmi, Parvathi Menon, many leading and successful actresses in the film industry have openly confessed that there is a casting couch in the South. Tollywood heroine Madhavi Latha open up about casting couch.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X