»   » షాకింగ్ లుక్: హీరోయిన్‌‌ను ఇలా చూసి భరించలేక పోతున్న ఫ్యాన్స్!

షాకింగ్ లుక్: హీరోయిన్‌‌ను ఇలా చూసి భరించలేక పోతున్న ఫ్యాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు ఫ్యాన్ ఫాలోయంగ్ ఎక్కువే. హాట్ అండ్ క్యూట్ లుక్ తో కాలేజీ అమ్మాయిలా కనపించే శ్రద్ధా దాస్ అంటే పడిచచ్చే కుర్రకారు ఎందరో. బాగి, ఎబిసిడి 2, ఓకే జాను చిత్రాల్లో శ్రద్ధా కపూర్ అందం, యాటిట్యూడ్ కు ఎంతో మంది ఫిదా అయిపోయారు.

తాజాగా శ్రద్దా కపూర్ 'హసీనా' అనే బయోపిక్ లో నటిస్తోంది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో శ్రద్ధా కపూర్ లుక్ చూసి అభిమానులు షాకయ్యారు. తమ కలల హీరోయిన్ ను ఇలా చూసి తట్టుకోలేక పోతున్నారు.

ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్ చేస్తోంది.

 శ్రద్ధా కపూర్

శ్రద్ధా కపూర్

హసీనా చిత్రంలో తన లుక్‌కు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ శ్రద్ధా సోమవారం అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఎవరూ ఊహించని లుక్ లో శ్రద్దా కపూర్ కనిపించడంతో అంతా షాకవుతున్నారు.

దావూద్ పాత్రలో

దావూద్ పాత్రలో

ఈ చిత్రంలో శ్రద్ధా సోదరుడు సిద్ధాంత్‌ కుమార్‌ దావూద్‌ ఇబ్రహీం పాత్రను పోషించడం విశేషం. ఆయనతోపాటు శర్మన్‌ జోషి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

 హసీనా

హసీనా

ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్, ఇతర పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 11న ‘హసీనా' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎలా ఉండేది

ఎలా ఉండేది


ఎంతో అందంగా తమకు కను విందు చేసిన శ్రద్ధా కపూర్ ఇపుడు హసీనా మూవీలో ఇలా మొరటుగా కనిపించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

English summary
Apoorva Lakhia’s upcoming film based on the life of India’s most wanted terrorist Dawood Ibrahim’s sister Haseena Parkar, ‘Haseena: The Queen of Mumbai’ will chronicle the journey of Parkar and the first look of the film, which has just been released, has left everyone spellbound.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu