»   » పుట్టిన రోజు పాపాయి: పవన్ కూతురు...తల్లితో కలిసి

పుట్టిన రోజు పాపాయి: పవన్ కూతురు...తల్లితో కలిసి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ రోజు కొనిదెల ఆధ్య(పవన్,రేణు దేశాయ్ ల కుమార్తె) పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈరోజుకు ఆమెకు ఐదు వస్తాయి. ఈ సందర్భంగా బర్తడే బేబితో కలిసి తల్లి ఇదిగో ఇలా ఫోజిచ్చింది. తల్లి,కూతుళ్లిద్దరూ మంచి ఉత్సాహంగా ఈ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. నిన్న రాత్రి ఈ పుట్టిన రోజు విషెష్ తెలియచేసారు పాపాయి కు. పుట్టిన రోజు శుభాకాంక్షలు..ఆద్య నీకు వన్ ఇండియా తెలుగు తెలియచేస్తోంది.

ఇక ఈ పుట్టిన రోజు స్పెలాషిటి... పాప..తన తండ్రితో కలిసి గడపటం..పవన్ కల్యాణ్ కేవలం స్టార్ హీరో,లీడర్ గానే కాక తన కుమార్తెకు తండ్రిగానూ తన ప్రేమను అందిస్తున్నారు. అందులో వింతేముంది అంటారా...రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చినా తన వల్ల పుట్టిన బిడ్డలకు తండ్రి లేని లోటు ఎప్పుడూ ఉండకూడదని భావించి ఆయన వాళ్లతో అవకాసమున్నప్పుడల్లా టైం స్పెండ్ చేస్తున్నారు.

 Have A Look: Birthday Day Girl Aadya!

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తన కుమార్తె ఆద్య 5వ పుట్టిన రోజు కు ముందు రోజు ఆయన తన కుమార్తెతో గడిపారు. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ ట్వీట్ ద్వారా ఈ ఫొటో షేర్ చేసి తెలియచేసారు. ఆమె ట్వీట్ చేస్తూ..."అందరికీ ఆయన ఓ నటుడు, స్టార్, లీడర్, రాజకీయవేత్త ఇంకా చాలా చాలా కావొచ్చు...కానీ ఆమెకు మాత్రం ఆయన కేవలం నాన్న అంటూ ట్వీట్ చేసారు.

ఇక పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య రేణుదేశాయ్‌కి ఇపుడు పార్టీ టైం. ఇద్దరూ కలిసి సోమవారం జరిగే ఓ పార్టీలో సంతోషంగా గడప బోతున్నారు. ఆల్రెడీ విడిపోయిన ఇద్దరూ కలవడం ఏమిటి, పార్టీ చేసుకోవడం ఏమిటి అనుకుంటున్నారా?..... భార్య భర్తలుగా విడిపోయినా వీరు తల్లిదండ్రులుగా తమ బాధ్యత నిర్వర్తించాలి కదా! అందుకే ఇదంతా...

అసలు విషయంలోకి వెళితే.... పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ ముద్దుల కూతురు ఆద్యా సోమవారం 5వ పుట్టినరోజు జరుపుకోబోతోంది. రేణు దేశాయ్ తన కూతురు కోసం చిన్నపాటి పార్టీ హోస్ట్ చేస్తున్నారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

తన ముద్దుల కూతురు బర్త్ డే గురించి రేణు దేశాయ్ వివరిస్తూ...‘బర్త్ డే గర్ల్ సోమవారం 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఆద్యతో కలిసి షాపింగ్ వెళ్లాను. బర్త్ డే కోసం స్పెషల్ డ్రెస్ తీసుకున్నాను' అంటూ రేణు దేశాయ్ వెల్లడించారు. బర్త్ పార్టీ భారీగా ఏర్పాటు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ..‘బర్త్ డే పార్టీ పెద్దగా ఏమీ చేయడం లేదు. ఇంట్లోనే చిన్నగా ఏర్పాటు చేస్తున్నాం. ఇళ్లు లేని వారికి అన్నదానం చేయాలనుకుంటున్నాం' అన్నారు.

పవన్ కళ్యాణ్ తన తన ముద్దుల కూతురు బర్త్ డే కోసం గిఫ్టు కొనే ఉంటాడని పలువురు అభిప్రాయ పడుతున్నారు. తన పిల్లలకు సంబంధించిన ఏ కార్యక్రమాన్నిపవన్ కళ్యాణ్ మిస్ కారు. ఆ మధ్య ఆద్య చదువుతున్న స్కూలుకు వెళ్లి స్వయంగా కూతురు డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసారు పవన్ కళ్యాణ్.

English summary
On Monday, Renu Desai shared the picture of herself with the Birthday Girl Aadya Konidala much to the delight of her followers and fans of Pawan Kalyan.
Please Wait while comments are loading...