Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
ఇండోనేసియా భూకంపం: 42కు పెరిగిన మృతులు -వందల ఇళ్లు ధ్వంసం -చీకట్లో సులవేసి దీవి
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
HBD Rajinikanth.. రాజకీయాల్లోనూ అదే శైలితో.. చిరంజీవి విషెస్ వైరల్
ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే (డిసెంబర్ 12) అంటే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. నేటి ఉదయం నుంచి ట్విట్టర్ కూత పెట్టలేక విసుగువచ్చి షట్ డౌన్ అయ్యేలా ఉందేమో. ఉదయం నుంచి రజినీకాంత్‌కు విషెస్ చెబుతు వస్తోన్న ట్వీట్లు సోషల్ మీడియాను ఊపేస్తోన్నాయి. టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా భారతదేశ నలుమూలల నుంచి తలైవాకు బర్త్ డే విషెస్ వస్తున్నాయి.

రెండు రకాల విషెస్..
రజినీకాంత్‌కు నేడు రెండు రకాల విషెస్ వస్తున్నాయి. కొందరు సినీ పరిశ్రమకు సంబంధించిన రికార్డుల గురించి చెబుతూ విషెస్ అందిస్తున్నారు. ఇంకొందరు రాజకీయాల్లో రజినీ సృష్టించబోయే ప్రభంజనాలు.. చరిత్ర సృష్టించాలంటూ విషెస్ చెబుతున్నారు.

కోలీవుడ్, మాలీవుడ్..
రజినీకాంత్‌కు కోలీవుడ్, మాలీవుడ్ నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. తమిళ హీరో, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు రజినీకి విషెస్ అందిస్తున్నారు. లోకేష్ కనకరాజ్, అనిరుద్, ఏఆర్ మురుగదాస్, పా రంజిత్, కార్తిక్ సుబ్బరాజ్, కుష్బూ, రాధిక, దుల్కర్ సల్మాన్, మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శిని ఇలా అందరూ విషెస్ చెప్పారు.

చిరు స్పెషల్ విషెస్..
డియరెస్ట్ ఫ్రెండ్ రజినీకాంత్‌కు 70వ జన్మదిన శుభాకాంక్షలు .. మున్ముందు మరింత అద్భుతమైన జీవితాన్నిఉండాలని కోరుకుంటున్నాను. రాజకీయాల్లోనూ మీకు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీ ప్రత్యేకమైన శైలి , స్టైల్ ద్వారా మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నారు.. ఆ మిలియన్ల మందికి సేవ చేయడంలోనూ మీరు ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారని నేను నమ్ముతున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు.

టాలీవుడ్ స్పెషల్ విషెస్..
టాలీవుడ్ నుంచి రజినీకాంత్‌కు స్పెషల్ విషెస్ అందుతున్నాయి. మహేష్ బాబు, వరుణ్ తేజ్, సందీప్ కిషన్, శ్రీకాంత్, మెహర్ రమేష్, బీవీఎస్ రవి, వెంకీ కుడుముల, సుశాంత్, రత్నవేలు ఇలా ఎంతో మంది రజినీకాంత్‌కు విషెస్ చెబుతూ ట్వీట్లు పెడుతున్నారు.