twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD SS Rajamouli: ఓటమి ఎరుగని దర్శకుడు.. చరిత్ర తిరగరాసిన దర్శక ధీరుడు

    |

    బాహుబలి చిత్రంతో ప్రపంచ గర్వించ దగిన దర్శకుడిగా ప్రతిష్టను సొంతం చేసుకొన్న తెలుగు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటి వరకు తాను రూపొందించిన చిత్రాల విషయంలో ఓటమి ఎరుగని దర్శకుడిగా ముద్ర వేసుకొన్నారు. సినిమా పరిశ్రమలో ప్రముఖులు, అభిమానులు ముద్దుగా పిలుచుకొనే పేరు జక్కన్న పుట్టిన రోజు అక్టోబర్ 10. ఈ సందర్భంగా దర్శక ధీరుడికి తెలుగు ఫిల్మీబీట్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన సినీ, వ్యక్తిగత జీవిత విషయాలు మరోసారి మీకోసం.

    Recommended Video

    #HBDSSRajamouli : Pan India Director With No Flop Till Date ఓటమి ఎరుగని దర్శక ధీరుడు | RRR
     రాజమౌళి వ్యక్తిగత జీవితం

    రాజమౌళి వ్యక్తిగత జీవితం

    ఎస్ఎస్ రాజమౌళి విషయానికి వస్తే ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్, రాజా నందినీ కుమారుడు. భార్య రమా రాజమౌళి. ఇక సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, కల్యాణ్ కోడూరి, శ్రీలేఖ తన కుటుంబ సభ్యులు అనే విషయం అందరికి తెలిసిందే. ఇలా సినీ కుటుంబంలో నుంచి ఆయన దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

    ఘన విజయాలతో సినీ ప్రయాణం

    ఘన విజయాలతో సినీ ప్రయాణం


    స్టూడెంట్ నంబర్ 1 హిట్ కావడంతో ఇక తన సినీ ప్రయాణంలో రాజమౌళి వెనుకకు తిరిగి చూసుకోలేదు. సింహాద్రి, సై, చత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న చిత్రాల ఘన విజయంతో టాప్ డైరెక్టర్‌గా మారారు. ఇక ఈగ చిత్రంతో విజువల్ గ్రాఫిక్స్‌ విభాగంపై పట్టు సాధించడమే కాకుండా దేశవ్యాప్తంగా పాపులారిటీని సాధించారు.

    బాహుబలి చిత్రంతో ప్రపంచ ఖ్యాతి

    బాహుబలి చిత్రంతో ప్రపంచ ఖ్యాతి


    ఇక బాహుబలితో రాజమౌళి ప్రతిభ దేశ ఎల్లలూ దాటింది. ప్రపంచ దేశాల్లోని సినీ ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా బాక్సాఫీస్ రికార్డులను దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తిరగరాశారు. బాహుబలి 2 చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా 2 వేల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించారు. దేశ సినీ చరిత్రలోనే ఇది అత్యుత్తమ బాక్సాఫీస్ రికార్డు.

     మరో ప్యాన్ ఇండియా మూవీగా RRR

    మరో ప్యాన్ ఇండియా మూవీగా RRR

    బాహుబలి తర్వాత ఎస్ఎస్ రాజమౌళి పలు భాషల్లో RRR చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్‌తో మల్టీ స్టారర్ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి తన జీవితంలో అత్యుత్తమ విజయాలను సొంతం చేసుకొని భారతీయ సినిమా పరిశ్రమను మరోస్థాయికి తీసుకెళ్లాలని తెలుగు ఫిల్మీబీట్ కోరుకంటూ జక్కనకు సాహో రాజమౌళి.. హ్యాపీ బర్త్ డే అంటూ మరోసారి బర్త్ డే విషెస్ తెలియజేస్తుంది..

    English summary
    The Indian director SS Rajamouli created history with Baahubali. He has tremendous record in his career with Highly success. His birthday is 10th october. In this occassion, Telugu filmibeat wishing happy birthday to Jakkanna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X