»   » కరిష్మా మాజీ భర్త ఎంత రిచ్చో.... ఆర్భాటంగా మూడో పెళ్లి!

కరిష్మా మాజీ భర్త ఎంత రిచ్చో.... ఆర్భాటంగా మూడో పెళ్లి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్: ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్.... ఇటీవలే తన భర్త సంజయ్ కపూర్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. సంజయ్ కపూర్ ఏప్రిల్ 13న మరో వివాహం చేసుకున్నాడు. ప్రియా సచ్‌దేవ్ అనే నటి, మోడల్‌తో ఢిల్లీలో అతడి వివాహం జరిగింది.

ఢిల్లీలో పెళ్లి సింపుల్‌గా జరిగినా... న్యూయార్కులో భారీగా డబ్బు ఖర్చు పెట్టి వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఇది సంజయ్ కపూర్ కు మూడో వివాహం కాగా, ప్రియా సచ్ దేవ్ కు ఇది రెండో వివాహం.

న్యూయార్క్ లో గ్రాండ్ రిసెప్షన్

న్యూయార్క్ లో గ్రాండ్ రిసెప్షన్

సంజయ్ కపూర్, ప్రియా సచ్ దేవ్ వెడ్డింగ్ రిసెప్షన్ న్యూయార్కులోని ‘ది నో మ్యాడ్' హోటల్ లో జరిగింది.
ఫోటో సోర్స్: ఇండియా టుడే

భారీగా ఖర్చు

భారీగా ఖర్చు

ఈ వేడుకకు ఇండియా నుండి, యూఎస్ నుండి సంజయ్, ప్రియా సచ్ దేవ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. అతిథులకు మర్యాదలు చేయడానికి భారీగా డబ్బు ఖర్చు పెట్టి గ్రాండ్ గా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

ప్రియా-సంజయ్ రిలేషన్ షిప్

ప్రియా-సంజయ్ రిలేషన్ షిప్

ప్రియా సచ్ దేవ్, సంజయ్ కపూర్ గత ఐదేళ్లుగా డేటింగులో ఉన్నారట. అయితే ఈవిషయం ఇంతకాలంగా గోప్యంగానే ఉంది. రహస్యంగా కలుసుకోవడం లాంటివి చేసేవారట.

ఇది ప్రియాకు రెండో వివాహం

ఇది ప్రియాకు రెండో వివాహం

సంజయ్ కపూర్ తో ప్రియాకు ఇది రెండో వివాహం. గతంలో ఆమె యూఎస్ బేస్డ్ హోటలియర్ సంత్ చత్వాల్ కుమారుడు విక్రమ్ ను పెళ్లాడారు. అప్పట్లో వీరి వివాహం ఉదయ్ పూర్ లో గ్రాండ్ గా జరిగింది. అయితే పెళ్లయిన కొంతకాలానికే వీరు విడిపోయారు.

సంజయ్

సంజయ్

సంజయ్ కపూర్ మొదటి వివాహం నందిత మహ్తానితో జరిగింది. ఆమెతో విడిపోయిన తర్వాత కరిష్మా కపూర్ ను రెండో వివాహం చేసుకున్నాడు. ఇపుడు ప్రియా సచ్ దేవ్ ను మూడో వివాహం చేసుకున్నారు.

ప్రియా సచ్ దేవ్

ప్రియా సచ్ దేవ్

ప్రియా సచ్ దేవ్ ఢిల్లీకి చెందిన బిజినెస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో గ్రాజ్యువేషన్ పూర్తి చేసింది. తర్వాత సంవత్సరం పాటు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా చేసింది. తర్వాత జాబ్ వదిలేసి మోడలింగ్, యాక్టింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఉదయ్ చోప్రా, తానిషా ముఖర్జీ నటించిన ‘నీల్ అండ్ నిక్కీ' మూవీలో నటించింది

English summary
Sunjay Kapur and Priya Sachdev tied the knot on April 13 this year in a secret ceremony, which was attended by only close friends and family members. The newly-wed couple recently organised a grand wedding reception party in New York. Check out the inside pictures from the reception below.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu