Just In
- 5 min ago
Box office: పది రోజులైనా తగ్గని క్రాక్ హవా.. మొత్తానికి మాస్టర్ పనైపోయింది
- 21 min ago
సిగరెట్ తాగుతూ బోల్డ్ మాటలు.. షాక్ ఇచ్చిన రేసుగుర్రం మదర్ పవిత్ర.. రెడ్ రెమ్యునరేషన్ ఎంత?
- 1 hr ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 2 hrs ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
నేడే అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం
- Automobiles
స్పోర్ట్స్ కార్లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!
- Sports
ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టిన టీమిండియా.. నెం.1లో న్యూజిలాండ్!
- Finance
41 కోట్ల జన్ ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ 7.5%
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విషమమే :M.S నారాయణ హెల్త్ బులెటిన్ విడుదల
హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ డాక్టర్లు గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎంఎస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్లు అమర్చినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు డయాలసిస్ కొనసాగుతుందని కిమ్స్ వైద్యులు చెప్పారు. కాగా ఎంఎస్ నారాయణ మరణించారన్న వార్తను ఆయన కుమారుడు విక్రమ్ ఖండించిన విషయం తెలిసిందే. ఎంఎస్ నారాయణ ప్రస్తుతం మాదాపూర్ కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
కాగా ఎంఎస్ నారాయణ ఆరోగ్యం విషయంలో కొన్ని వదంతులు చెలరేగడంతో సినీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఇటీవల భీమవరంలో అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులు ఎంఎస్ నారాయణ వెంటే ఉన్నారు. ఎంఎస్ నారాయణను సహచరులు, సన్నిహితులు ఆయన్ను పరామర్శిస్తున్నారు. ఈ సమయంలోనే ఎమ్మెస్ ఆరోగ్య పరిస్థితిపై వదంతులు చెలరేగాయి. అయితే అవన్నీ తప్పంటూ ఆయన కొడుకు విక్రమ్ తెలిపారు.

వదంతులు నమ్మొద్దని విక్రమ్ సూచించారు. కాగా గురువారం మధ్యాహ్నం 12.30గంటల సమయంలో ఎంఎస్ నారాయణను కమెడియన్లు బ్రహ్మానందం, రావు రమేష్‌లు.. కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. బ్రహ్మానందం, రావు రమేష్ పలకరించగా.. ఎంఎస్ నారాయణ స్పందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవాలని బ్రహ్మానందం కుటుంబ సభ్యులకు సూచించినట్టు తెలిసింది.
వివరాల్లోకి వెళితే.... ఎంఎస్ నారాయణ స్వస్థలం భీమవరానికి సంక్రాంతి పండుగ నిమిత్తం వచ్చి ఆదివారం సాయంత్రం స్థానిక హోటల్‌లో గది తీసుకున్నారు. ఆహారం తీసుకున్న అనంతరం రాత్రివేళ ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.సన్నిహితులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఫుడ్ పాయిజన్ అని చికిత్స చేశారు.
విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు, సినీ హీరో విక్రమ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సోమవారం సాయంత్రం వైద్యులు తెలిపారు.
కెరీర్ విషయానికి వస్తే...
మన తెలుగు తెరపై తాగుబోతు పాత్రలంటే ముందు గుర్తొచ్చే పేరు ఎమ్మెస్ నారాయణ పేరే. ఇప్పుడంటే తాగుబోతు రమేష్ వచ్చాడు కానీ ఇంతకుముందు తాగుబోతు పాత్ర అంటే ఎమ్మెస్ ని గుర్తు చేసుకోవాల్సిందే. తనదైన కొత్త తరహా మేనరిజమ్‌తో ఈ తరహా పాత్రలకు ఆయనకు ఆయనే సాటి. కృష్ణంరాజు, శ్రీకాంత్ నటించిన మా నాన్నకి పెళ్లి చిత్రంతో నటుడిగా ఆయన కెరీర్ ప్రారంభించి 17 ఏళ్లు దాటింది. ఈ ప్రయాణంలో 700ల చిత్రాలు పైగా పూర్తి చేసిన నటుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు ఎమ్మెస్ నారాయణ.
ఎంఎస్ నారాయణ మాట్లాడుతూ... అతి తక్కువ కాలంలో 700 సినిమాల్లో నటించిన నటుడ్ని తానేనని చెప్పారు. ఈదిశగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో పేరు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ సినీ రచయిత అవుదామని 1994లో హైదరాబాద్ వెళ్లాను. 1997లో నటుడిగా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నాను. ప్రస్తుతం 15 సినిమాల్లో నటిస్తున్నా. దూకుడు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పారు.
ఇక మాజీ ఎంపీ మెంటే పద్మనాభం సహకారంతోనే సినీ రంగంలోకి ప్రవేశించా. ఆయనే నాకు గాడ్‌ఫాదర్. హాస్యనటులు మల్లికార్జునరావు, ఏవీఎస్, శ్రీహరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇటీవల మరణించడం నాన్నెంతగానో బాధించింది. వారు లేని లోటు చిత్రసీమకు తీర్చలేనిది. హైదరాబాద్‌లో తెలుగు సినిమా వాళ్లకు ఇబ్బంది లేకపోయినా.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లోనూ చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి.
అలాగే... సినిమాల్లో ఎక్కువగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల మాండలికాన్ని వాడుతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మాండలికంలో కూడా సినిమాలు రావచ్చు. ఎందుకంటే సినీ రంగానికి నైజాం ప్రాంతం నుంచే 50 శాతం ఆదాయం వస్తోంది. తెలంగాణ ఆర్టిస్టులతోనే పూర్తిస్థాయిలో సినిమాలు తీసే పరిస్థితి లేకపోలేదు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినీ షూటింగ్‌లకు సరిపడా మౌలిక వసతులు ఉన్నాయి. ఈదిశగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది.' అని అన్నారు.