»   » హెబ్బా పటేల్... ఎంత మంది బాయ్ ఫ్రెండ్సో?

హెబ్బా పటేల్... ఎంత మంది బాయ్ ఫ్రెండ్సో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కుమారి 21 ఎఫ్ సినిమాతో తన అందం, నటన, యాటిట్యూడ్‌తో యూత్ మెచ్చిన హీరోయిన్ గా మారి పోయింది హెబ్బా పటేల్. ప్రస్తుతం ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆమె మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాల్లో కూడా హెబ్బా పటేల్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఆమె చేస్తున్న సినిమాల్లో ఓ మూవీ టైటిల్ హాట్ టాపిక్ అయింది. ''నేను.. నా బాయ్ ఫ్రెండ్స్'' అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వివి వినాయక్ దగ్గర్ అసోసియేట్ గా పనిచేసిన భాస్కర్ బండి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.

హెబ్బ పటేల్, రాజ్ తరుణ్ కాంబినేషన్లో వచ్చిన 'కుమారి 21ఎఫ్' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ తెరపై తమ రొమాంటిక్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఖరారైంది. గతంలో 'దేనికైనా రెడీ' సినిమాకు దర్శకత్వం వహించిన జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

ఎకె ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. 'కుమారి 21 ఎఫ్' చిత్రంలో హెబ్బా పటేల్ పెర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన దర్శక నిర్మాతలు ఈ సినిమాలో ఆమెకు చాన్స్ ఇచ్చినట్లు చెబుతున్నారు. 

హెబ్బ పటేల్

హెబ్బ పటేల్


హెబ్బ పటేల్ వయసు 22 సంవత్సరాలు. జనవరి 6, 1994లో జన్మించింది.

ముంబై

ముంబై


హెబ్బ పటేల్ ముంబైలో పుట్టి పెరిగింది.

తొలి చిత్రం

తొలి చిత్రం


హెబ్బ పటేల్ తొలి చిత్రం కన్నడలో తెరకెక్కిన ‘అద్యక్ష'

తమిళంలో..

తమిళంలో..


తమిళంలో తిరుమానం ఎనుమ్ నిఖా అనే చిత్రంలో నటించింది.

తెలుగులో..

తెలుగులో..


తెలుగులో ఆమె తొలుత ‘అలా ఎలా' అనే చిత్రంలో నటించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘కుమారి 21ఎఫ్' చిత్రంతో హెబ్బకు మంచి గుర్తింపు వచ్చింది.

English summary
Hebah's popularity has increased so high that she has just can roped for a female centric film titled, Nenu Na Boyfriends. Going by the title, looks like the makers are eyeing to cash in on Hebah's image.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu