»   »  గోడకు కొట్టిన బంతిలా పవన్ : ఫ్యాన్స్ పండుగ చేసుకునే న్యూస్

గోడకు కొట్టిన బంతిలా పవన్ : ఫ్యాన్స్ పండుగ చేసుకునే న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ ఫలితం పవన్ ని పూర్తి స్దాయి ఆలోచనలో పడేసింది. దాని ఫలితమే గోడకు కొట్టిన బంతిలా ఆయన మరింత ఉత్సాహంతో సూపర్ హిట్స్ ని కొట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. అందుకోసం ఆయన కొత్త వ్యూహాలేమీ రచించటం లేదు.

తనకు గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగమే..ఎస్ జె సూర్య ఆయన సినిమా. ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సూర్య..ఈ సారి ఎలాగైనా పవన్ కు సూపర్ హిట్ ఇవ్వాలని మరింత కసితో స్క్రిప్టు మీద ఇరవైనాలుగు గంటలూ పనిచేసి, వర్కవుట్ చేసి తెరకెక్కిస్తారు.

Hello Pawan Kalyan Fans, Gabbar Singh & Attariniki Daredi Days Are Back!

ఆ తర్వాత ఆయన సెప్టెంబర్ నుంచి దాసరి నారాయణరావుకు బల్క్ డేట్స్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం తమిళ స్టార్ హీరో సూర్యతో అనుకున్నారు. కానీ సూర్య తాజా చిత్రం 24 అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాకపోవటంతో కొద్దికాలం ఈ కాంబినేషన్ ని వాయిదా వేసారు. దాంతో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ సిద్దమవుతోంది.

ఈ మేరకు త్రివిక్రమ్ ఇప్పటికే స్క్రిప్టు వర్క్ లో కూర్చున్నారు. అత్తారింటికి దారేది, జల్సా లాంటి హిట్స్ తర్వాత తమ నుంచే వచ్చే చిత్రం ఏ స్దాయిలో ఉండాలో అంతకు మించి అన్నట్లు త్రివిక్రమ్ పని చేస్తున్నట్లు వార్త.

Hello Pawan Kalyan Fans, Gabbar Singh & Attariniki Daredi Days Are Back!


ఇదిలా ఉంటే మరో ప్రక్క తనకు గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ని సీన్ లోకి తెస్తున్నారు పవన్. ఎ.ఎమ్ రత్నం నిర్మాతగా రూపొందిన వేదాలం రీమేక్ వర్క్ ని హరీష్ శంకర్ కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే హరీష్ శంకర్ టాలెంట్ ని మరోసారి అద్బుతంగా ప్రూవ్ చేసుకునే సమయం వచ్చిందన్నమాట. పవన్ లాంటి హీరో దొరికితే ఆయనలో క్రియేటివిటీ పరవళ్లు తొక్కుతుందనేది చరిత్ర చెప్పిన సత్యం.

ఇవన్నీ చూస్తూంటే మీకేమనిపిస్తోంది. పవన్ మళ్లీ తన పాత రోజులని అభిమానులకు అందివ్వనున్నారు. వరస మూడు సూపర్ హిట్స్ తో చెలరేగిపోనున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ పోవటం ఓ రకంగా మేలే చేసిందన్నమాట.

English summary
Our highly placed sources informed that Pawan has given his bulk dates for Dasari Narayana Rao from September, for a project likely to be helmed by Trivikram. Besides this sensational news, grapevine also suggests that Pawan Kalyan will be simultaneously working with Harish Shankar for a film, which will be produced by A M Rathnam. If the reports are to be trusted, it could be the remake of Tamil film, Vedalam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu