Don't Miss!
- News
స్మితా ఇంటికి ప్రమోషన్లపై చర్చించేందుకే వెళ్లా: ఆనంద్ కుమార్, రాత్రే ఎందుకంటే?
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
హీరో హీరోయిన్లుగా...సింగర్ శ్రావణ భార్గవి, హేమచంద్ర
హైదరాబాద్: అటు బుల్లి తెరతో పాటు, ఇటు వెండి తెరపై ప్లేబ్యాక్ సింగర్లుగా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి. వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరిదీ ఒకే కెరీర్ కావడంతో...పెళ్లి తర్వాత కూడా సింగర్లుగా, టీవీ రియాల్టీ షోలలో రాణిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
ఇప్పటి వరకు సంగీత ప్రపంచంలో ఉన్నవారు త్వరలో నటనా రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే వీరు ఓ షార్ట్ ఫిల్మ్ లో హీరో హీరోయిన్లుగా నటించారు. సినిమా రంగంలోకి వెళ్లాలనే ఆసక్తి ఇద్దరిలోనూ ఉంది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రావణ భార్గవి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

శ్రావణ భార్గవి మాట్లాడుతూ...‘ఇప్పటి వరకు పాటలు పాడటంతో పాటు రియాల్టీ షోలు చేసాం. గబ్బర్ సింగ్, రామయ్యా వస్తావయ్యా చిత్రాల్లో శృతి హాసన్‌కు డబ్బింగ్ కూడా చెప్పాను. ఈగ హిందీ వెర్షన్ ‘మక్కీ'లో సమంత వాయిస్‌కు డబ్బింగ్ చెప్పాను. ఈ ఏడాది నటించాలనే నిర్ణయం కూడా తీసుకున్నామని తెలిపారు.
గీతం కళాశాల విద్యార్థులు లఘు చిత్రంలో నటించమని అడిగారు. కాన్సెప్టు బాగుండటంతో ఒప్పుకున్నాం. ఇందులో నేను, హేమచంద్ర హీరో హీరోయిన్లుగా నటించారు. షూటింగ్ పూర్తయింది. ‘లక్కీ లవ్' పేరుతో ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కాబోతోంది. మంచి పాత్రలు వస్తే నటించడానికి సిద్ధమే' అని తెలిపారు.
తమ ప్రేమ గురించి వెల్లడిస్తూ...‘రైడ్' సినిమాకు హేమ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్. ఆ సినిమాలో ఓ పాట పాడటానికి వెళ్లినపుడు తమ మధ్య పరిచయం ఏర్పడిందని, తొలుత హేమచంద్ర ప్రపోజ్ చేసాడు. మొదట్లో మా పెళ్లిపై ఇంట్లో వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. ఆ తర్వాత ఒప్పుకున్నారు. ఇపుడు మేము చాలా సంతోషంగా ఉన్నామని శ్రావరణ భార్గవి తెలిపారు.