»   » పవన్ కళ్యాణ్ నుండి ఆమెకు పిలుపు?

పవన్ కళ్యాణ్ నుండి ఆమెకు పిలుపు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ‘పులి' హీరోయిన్ నికిషా పటేల్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. త్వరలో ప్రారంభం అయ్యే ‘గబ్బర్ సింగ్-2' చిత్రంలో ఆమె ఐటం సాంగ్ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. స్వయంగా పవన్ కళ్యాణ్ నుండి ఆమెకు పిలుపు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో నికిషా మాట్లాడుతూ ``నాకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేనే వాటిని వద్దనుకుంటున్నాను. నాగచైతన్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేయమని అడిగారు. కానీ అలాంటి స్పెషల్ సాంగ్ లు చేయాలని లేదు. ఒకవేళ చేసినా అది ఒన్ అండ్ ఒన్లీ పవన్ కల్యాణ్ సినిమాల్లోనే చేస్తాను. ఇంకెవరి సినిమాల్లోనూ చేయను`` అని నిక్కచ్చిగా చెప్పింది. ఇపుడు స్వయంగా పవన్ కళ్యాణ్ నుండి పిలుపు రావడంతో అమ్మడు చాలా హ్యాపీగా ఉంది.

Her feelers reached Pawan finally

నిఖిషా గురించిన వివరాల్లోకి వెళితే 'పులి' చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ సరసన అవకాశం దక్కడంతో స్టార్ హీరోయిన్ కావడం ఖాయమని కలలుకన్న ఆమెకు తొలిచిత్రంతోనే చేదు అనుభవం ఎదురైంది.

పులి చిత్రం ప్లాపు కావడంతో నికిషా పటేల్‌కు అవకాశాలే కరువయ్యాయి. ఎదురు చూడగా..చూడగా ఆ తర్వాత రెండేళ్లకు కన్నడ చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది. అయినా పెద్దగా పేరు మాత్రం రాలేదు. ఆ మధ్య తెలుగు చిత్రం కళ్యాణ్ రామ్ 'ఓం 3డి' చిత్రంలో అవకాశం దక్కినా మళ్లీ నిరాశే ఎదురైంది.

ప్రస్తుతం తమిళ, కన్న చిత్రాలపై దృష్టి సారించిన నికిషా పటేల్ తన గ్లామర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆమె అందం ఐటం సాంగులకు పనికొచ్చే విధంగా ఉండటంతో కొందరు ఆమెను సంప్రదించారు. అయితే ఆమె మాత్రం ససేమిరా అంటోంది.

English summary
As per reports Pawan called the actress Nikisha Patel and asked her to do a special number for his upcoming film, Gabbar Singh-2. Although she is not ready for item songs she has given her consent owing to her respect for Pawan. Earlier she rejected to play item number in Naga chaitanya’s upcoming film Dochey.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu