»   » తెలివైనవాడు ఇలా చేస్తాడా?: 'ఇంటిలిజెంట్'పై కత్తి, వినాయక్ మార్క్ మిస్ అయిందా!

తెలివైనవాడు ఇలా చేస్తాడా?: 'ఇంటిలిజెంట్'పై కత్తి, వినాయక్ మార్క్ మిస్ అయిందా!

Subscribe to Filmibeat Telugu
'ఇంటిలిజెంట్'పై కత్తి కామెంట్..!

పవన్ ఫ్యాన్స్‌తో వివాదంపై మెత్తబడ్డప్పటికీ.. ప్రజాస్వామ్య బద్దంగా ఎప్పటిలాగే తన విమర్శలు కొనసాగుతాయని ఫిలిం క్రిటిక్ మహేష్ కత్తి తెలిపిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఇంతకుముందు లాగే ఆయన తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదలైన సాయిధరమ్ తేజ్ 'ఇంటిలిజెంట్' పోస్టర్ పై మహేష్ కత్తి పెదవి విరిచారు..

కత్తి కామెంట్:

'ఇంటిలిజెంట్' ప్రీ లుక్‌పై మహేష్ కత్తి తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. చేతికి బ్యాండేజ్‌తో గన్ పట్టుకుని ఉన్న పోస్టర్ అంత ఇంటెలిజెంట్‌గా లేదని చెప్పారు. 'తెలివైనవాడు గాయపడిన చేత్తో గన్ పట్టుకోవడం ఏమిటో! టైటిల్‌కి తగ్గ పోస్టర్ అయితే కాదు' అని కామెంట్ చేశారు.

 టైటిల్‌పై విమర్శలు:

టైటిల్‌పై విమర్శలు:

మహేష్ కత్తి కామెంట్ పక్కనపెడితే.. ఈ సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలోనూ కొన్ని సెటైర్స్ పడుతున్నాయి. 'ఇంటెలిజెంట్' అన్న పదాన్ని 'ఇంటి'లిజెంట్‌గా మార్చేశారని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే టైటిల్ ఇలా పెట్టడంలో కథకేమైనా లింక్ ఉందేమో అనేవారు లేకపోలేదు.

 వినాయక్ మార్క్ 'మిస్':

వినాయక్ మార్క్ 'మిస్':

సాధారణంగా వినాయక్ అంటేనే పక్కా మాస్ డైరెక్టర్ అన్న పేరు. గత కొంతకాలంగా మాస్ ఇమేజ్ కోసం తెగ ప్రయత్నిస్తున్న సాయిధరమ్ తేజ్.. అందులో భాగంగానే ఇప్పుడాయన సినిమాలో నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో వినాయక్ 'మాస్' మార్క్ మిస్ అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫస్ట్ లుక్‌ ఎలా ఉంది?:

ఫస్ట్ లుక్‌లో సాయి ధరమ్ తేజ్ సీరియస్ లుక్‌లో గాయాలతో కనిపిస్తున్నాడు. ఇందులో సాయిధరమ్ ముఖం సగం వరకు కవర్ చేసి ఉంది. వినాయక్ తన శైలికి భిన్నంగా సాయిధరమ్ ను చాలా సింపుల్ గా ప్రెజెంట్ చేశాడని అభిమానులు అంటున్నారు.

 ఫిబ్రవరి 9న రిలీజ్:

ఫిబ్రవరి 9న రిలీజ్:

లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సాయిధరమ్ విభిన్న పాత్రలో కనిపించబోతున్నాడట. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ 'ఇంటిలిజెంట్' చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, నాజర్‌, రాహుల్‌దేవ్‌ తదితరులు నటించారు.

English summary
Here is the first look of Sai Dharam Tej's 'Intelligent'. 'Supreme Hero' Sai Dharam Tej is struggling for a hit for the past two years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu