»   » ఏ హీరోకూ ఈ పరిస్థితి రాకూడదు: ప్రేమించిన అమ్మాయికి అన్నయ్యగా!

ఏ హీరోకూ ఈ పరిస్థితి రాకూడదు: ప్రేమించిన అమ్మాయికి అన్నయ్యగా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్రేమించిన అమ్మాయిని సోదరిగా చూడటం ఏ ప్రేమికుడి వల్లా కాదు. అది నటనే అయినా మనసు ఒప్పదు. కనీసం అలాంటి ఊహ కూడా రావడానికి ఎవరూ ఇష్టపడరు. అలాంటి అనుభవమే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఎదురైంది.

  గతంలో సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ దాదాపు రెండేళ్లు డేటింగ్ చేశారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ కొన్ని కారణవల్ల ఇద్దరూ విడిపోయారు. అప్పట్లో వీరిద్దరి మధ్య గొడవ మీడియాలో సంచలనం. వారు విడిపోయిన తర్వాత జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే.

  ఐశ్వర్యరాయ్‌కి సోదరుడిగా

  ఐశ్వర్యరాయ్‌కి సోదరుడిగా

  ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్ గొడవపడక ముందు.... ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతున్న సమయంలో సల్మాన్ వద్దకు ఓ ప్రపోజల్ వచ్చిందట. అప్పట్లో మన్సూర్ అలీ ఖాన్ అనే దర్శకుడు తాను తెరకెక్కిస్తున్న ‘జోష్' మూవీలో ఐశ్వర్యకు బ్రదర్ పాత్ర పోషించాలని సల్మాన్ ఖాన్ ఆశ్రయించాడట.

  Salman Khan Controversial Comments On Baahubali And South Viewers
  రిజక్ట్ చేసిన సల్మాన్

  రిజక్ట్ చేసిన సల్మాన్

  అయితే సల్మాన్ ఖాన్ ఆ సమయంలో ఐశ్వర్యరాయ్ తో ప్రేమలో ఉండటంతో తాను అలాంటి పాత్ర చేయలేనని తేల్చి చెప్పాడట. అది నటనే అయినా నా వల్ల కాదని, నా ప్రియురాలితో అలాంటి ప్రయోగాలు చేయనని ఆ ఆఫర్ రిజక్ట్ చేశాడట.

  ఫైనాల్‌గా షారుక్ ఖాన్ ఓకే చేశాడు.

  ఫైనాల్‌గా షారుక్ ఖాన్ ఓకే చేశాడు.

  అయితే ఆ పాత్ర పెద్ద హీరోతో చేస్తేనే బావుంటనే ఉద్దేశ్యంతో...తర్వాత షారుక్ ఖాన్‌ను సంప్రదించి అతడితో ఈ పాత్ర చసేందుకు ఓకే చేయించాడు మన్సూర్ అలీ ఖాన్.

  రెండు సంవత్సరాలు డేటింగ్

  రెండు సంవత్సరాలు డేటింగ్

  అప్పట్లో సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ దాదాపు రెండు సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. ఈ సమయంలో ఇద్దరూ కలిసి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

   రిలేషన్ షిప్‌

  రిలేషన్ షిప్‌

  జోష్ మూవీలో ఐశ్వర్యరాయ్ సోదరుడి పాత్ర చేయాలని సల్మాన్ ఖాన్ కు ఆఫర్ వచ్చే నాటికే ఇద్దరూ లవ్ రిలేషన్లో ఉన్నారు. ఈ విషయంలో అప్పుడు ఇద్దరి మధ్య చర్చ కూడా జరిగింది, అనంతరం సల్మాన్ ఖాన్ మన్సూర్ అలీ ఖాన్ ఆఫర్ తిరస్కరించాడు.

  సల్మాన్ ఖాన్ యాటిట్యూడ్

  సల్మాన్ ఖాన్ యాటిట్యూడ్

  ఐశ్వర్యరాయ్‌ని ప్రేమిస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ ప్రవర్తన చాలా వింతగా ఉండేదని, ఐశ్వర్యరాయ్‌ మీద సర్వ హక్కులు తనవే అనే యాటిట్యూడ్ ప్రదర్శించేవాడని, అతడి ప్రవర్తన వల్ల ఐశ్వర్యరాయ్ చాలా సందర్భాల్లో ఇబ్బంది పడిందని అప్పట్లో వార్తలొచ్చాయి.

  క్రమంగా దూరమైన ఐష్

  క్రమంగా దూరమైన ఐష్

  అయితే సల్మాన్ ప్రవర్తనతో విసుగుచెందిన ఐశ్వర్యరాయ్ క్రమం క్రమంగా అతడిని దూరం పెట్టడం ప్రారంభించిందని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని టాక్.

  తట్టుకోలేకపోయిన సల్మాన్

  తట్టుకోలేకపోయిన సల్మాన్

  ఐశ్వర్యరాయ్ తనను దూరం పెడుతుండటాన్ని సల్మాన్ ఖాన్ తట్టుకోలేక పోయాడు. ఓ రోజు ఐశ్వర్యరాయ్ ఇంటి వద్ద సీన్ క్రియేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఈ వ్యవహారం గురించి అప్పట్లో మీడియాలో కథలుకథలుగా రాశారు.

  ఐశ్వర్యరాయ్ పేరెంట్స్ వ్యతిరేకం

  ఐశ్వర్యరాయ్ పేరెంట్స్ వ్యతిరేకం

  సల్మాన్ ఖాన్-ఐశ్వర్యరాయ్ ప్రేమాయణం ఐష్ తల్లిదండ్రులకు కూడా అస్సలు నచ్చేది కాదట. అప్పటికే సల్మాన్ ఖాన్ మీద ప్లేబాయ్ ఇమేజ్ ఉండటమే ఇందుకు కారణం.

  బ్రేకప్ తర్వాత కలిసి నటించలేదు

  బ్రేకప్ తర్వాత కలిసి నటించలేదు

  సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ బ్రేకప్ తర్వాత వారు కలిసి నటించలేదు. భవిష్యత్తులో కూడా వీరు కలిసి నటించే అవకాశం కూడా లేదు లేదు.

  English summary
  Salman Khan was head over heels in love with Aishwarya Rai Bachchan during the shooting of Hum Dil De Chuke Sanam. Aishwarya too was very fond of Salman at that time. Everyone in the industry knew about their romance and you will be surprised to know that even after that, a filmmaker had offered Salman Khan to play the on-screen brother of his then girlfriend Aishwarya Rai Bachchan. Crazy, isn't it?
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more