twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి రూ.1000 కోట్ల ప్రాజెక్ట్ ‘గరుడ’!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘బాహుబలి' సినిమాతో ఔరా అనిపించిన దర్శకుడు రాజమౌళి.... తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం బాహుబలి పార్ట్ 2ను తెరకెక్కించే పనిలో ఉన్న రాజమౌళి దీని తర్వాత ‘గరుడ' అనే మరో భారీ ప్రాజెక్టు చేయబోతున్నట్లు టాక్.

    అసలు ‘గరుడ' ప్రాజెక్టు గురించి రాజమౌళి ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. అయితే ఫిల్మ్ నగర్లో మాత్రం ఈ విషయమై హాట్ టాపిక్ నడుస్తోంది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఇండియన్ సినీ చరిత్రలో ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే అని అంటున్నారు.

    అయితే ఇండియాలో ఇంత బడ్జెట్ పెట్టే సంస్థలు గానీ, నిర్మాతలు గానీ లేరు. అందుకే ముందుగా రూ. 25 కోట్ల ఖర్చుతో 25 సెకన్ల నిడివిగల ‘గరుడ' టీజర్ రూపొందించి.... తద్వారా ఇంటర్నేషనల్ సినీ నిర్మాణ సంస్థలను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారట. గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించే ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కబోతోందట.

    Here's The Strategy Behind Rajamouli's 1000 Crores Project Garuda

    రాజమౌళి రూ. 250 కోట్ల పైచిలుకు బడ్జెట్ తో రెండు భాగాలుగా ‘బాహుబలి' మొదలు పెట్టినప్పుడు ఇంత బడ్జెట్ ఎక్కువ అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ బాహుబలి తొలి భాగమే రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసింది. రెండో భాగం విడుదలైన తర్వాత మరో 650 కోట్లు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

    ఈ నేపథ్యంలో రాజమౌళి రూ. 1000 కోట్ల ప్రాజెక్టు చేయడాన్ని పలువురు సమర్దిస్తున్నారు. రాజమౌళి దగ్గర ఆ సత్తా ఉందని, పెట్టుబడికి రెండింతల లాభాన్ని నిర్మాతలకు తెచ్చిపెట్టే కెపాసిటీ ఆయనకు ఉందని అంటున్నారు. మరి ఈ ప్రాజెక్టు గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రూ. 1000 కోట్లు అది తప్పకుండా హాలీవుడ్ ప్రాజెక్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    English summary
    Rajamouli's 1000 crores project, Garuda is now creating a rage even before its take off. Though the director did not officially acknowledge the news, sources close to him have already confirmed that there will be a grand project from the director made with a whopping 1000 crores budget.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X