»   » వరంగల్‌లో అల్లు అర్జున్ పేరుతో నకిలీ ఓటర్ దరఖాస్తు!

వరంగల్‌లో అల్లు అర్జున్ పేరుతో నకిలీ ఓటర్ దరఖాస్తు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ స్టార్స్ పేరుతో నకిలీ ఓటర్ దరఖాస్తు గతంలో చాలా సందర్భాల్లో చూసాం. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ పేరు, ఫోటోను వాడుతూ ఎవరో ఆకతాయిలు ఆన్ లైన్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశారు. ఈ ఘటన వరంగల్ లో జరిగింది. వరంగల్ కాకతీయ చరిత్రకు సంబంధించి రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్ర చేసిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడం విశేషం.

ఖిల్లా వరంగల్ లోని ఇంటి నంబర్ 16-10-1452లో ఆయన నివాసం ఉంటున్నాడని, వయస్సు 30 సంవత్సరాలా 7 నెలలని చెబుతూ, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ వచ్చిన దరఖాస్తును కనుగొన్న అధికారులు విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అరుణ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అరుణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

అల్లు అర్జున్ తాజా సినిమా ‘సరైనోడు' వివరాల్లోకి వెళితే...
అల్లు అర్జున్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రియల్ 8, 2016 న విడుదల చేయటానికి తేదీ ని ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఏమీ లేదు.

Hero Allu Arjun Name in Warangal Voters List

ఇక మాస్‌, యాక్షన్‌, వినోదం ఇలా ఎలాంటి కథలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు అల్లు అర్జున్‌. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'తో కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. హీరోలోని వీరత్వాన్ని ఓ స్థాయిలో చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను కావటంతో వీళ్లిద్దరి కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రం ఎలా ఉండబోతోందనేది అందరిలో ఆసక్తి నెలకొంది.

రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. పవర్‌ఫుల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ భిన్నకోణాల్లో సాగుతుందని తెలిసింది. బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తొలిసారిగా రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.

బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని ఎప్పటినుంచో ఇండస్ట్రీలో వినిపిస్తున్నప్పటికి... కార్యరూపం దాల్చటానికి టైమ్ పట్టింది.. తొలిసారి బన్నీ, బోయపాటి కాంబినేషన్ ఫ్యాన్స్ కి కిక్కివ్వబోతోంది... ఫస్ట్ టైమ్ వీరిద్దరి కలయికలో వస్తున్నఈ ప్రాజెక్ట్ పై భారీ అంచానాలు నెలకొన్నాయి.... ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ టైమ్ జతకట్టింది... గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

అలాగే ఈ చిత్రంలో చబ్బీ బ్యూటీ అంజలి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న సరైనోడు చిత్రంలో ఆమె నటించనుందని సమాచారం. ఈ సినిమాలో ఆమెది ఫుల్ ప్లెడ్జెడ్ రోల్ కాకపోయినా ఆమె స్పెషల్ అప్పీరియన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచే పాత్ర అని చెప్తున్నారు.

ఓ సీన్, స్పెషల్ సాంగ్ అని చెప్తున్నారు. మొదటి ఈ పాత్రకు గానీ అనుష్క ను అనుకున్నా ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటంతో అంజలి సీన్ లోకి వచ్చిందని తెలుస్తోంది. అయితే ఆ టీమ్ మాత్రం ఎప్పుడూ అనుష్క ని ఎప్రోచ్ కాలేదని చెప్తున్నారు.

English summary
Officials were surprised after they received an application on the name of actor Allu Arjun for inclusion in voters list for the by-election of Warangal Lok Sabha seat. Applicant mentioned Allu Aravind in father?s column and wrote house number as 16-10-1452 from Fort Warangal.
Please Wait while comments are loading...