»   » జనతా గ్యారేజ్ పై విక్టరీ వెంకటేష్ వ్యాఖ్యలు.... టీం మొత్తాన్నీ ఇలా...

జనతా గ్యారేజ్ పై విక్టరీ వెంకటేష్ వ్యాఖ్యలు.... టీం మొత్తాన్నీ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనతా గ్యారేజ్ తో వరుస హిట్ ని నమోదు చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ రెండో వీకెండ్ లోకి ఎంటర్ అయిపోయాడు. ఫస్ట్ వీకెండ్ లోను.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లోను చాలానే రికార్డులు బద్దలు కొట్టేసిన గ్యారేజ్.. ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల్లో సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. ఇక ఏ అనుమానమూ లేకుండా అనుకున్న టార్గెట్ రీచ్ ఆయే లాగే ఉంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు బోలెడన్ని లాభాలు పంచుతున్న ఎన్టీఆర్.. ఇప్పటికే తన ఆల్ టైమ్ రికార్డ్ మూవీ నాన్నకు ప్రేమతో ని ఎప్పుడో దాటేసినట్టే. ఇక ఇప్పుడు కొత్తగా విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమా పై మంచి రిపోర్టే ఇచ్చాడు.

టాక్ కు.. రివ్యూలకు అతీతంగా విజయాన్ని అందుకున్న చిత్రం జనతా గ్యారేజ్.ఈ సినిమా జూనియర్ ఎన్టిఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోనుంది.అటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల తూఫాన్ సృష్టిస్తోంది. వాస్తవానికి జనతా గ్యారేజ్ మూవీలో కాసిన్ని లోటుపాట్లున్నా... కేస్టింగ్‌తో పాటు సినిమాలో ఉన్న భారీతనం.. ఎన్టీఆర్ యాక్టింగ్.. కొరటాల టేకింగ్.. ఆ లోపాలను ఓవర్ కమ్ చేసేశాయి. చాలా నెలల తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు బారులు తీరేలా చేసిన సినిమా జనతా గ్యారేజ్ అనడంలో సందేహాలు అక్కర్లేదు.అదే విశయాన్ని మళ్ళీ తాను స్వయంగా చెప్పాడు వెంకటేష్ 'జనతా గ్యారేజ్ చూసా. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఎన్టీఆర్.. మోహన్ లాల్ లు అద్భుతంగా నటించారు. టీం మొత్తానికి కంగ్రాట్స్' అంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు వెంకటేష్. స్టార్ హీరోలు ఇతర హీరోలను పొగిడే సందర్భాలు.. వారి చిత్రాలను పబ్లిక్ గా ప్రశంసించే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయ్ కానీ.. వెంకటేష్ మాత్రం ఇలాంటి లిమిట్స్ కి అతీతం. తనకు నచ్చితే ఆ విషయాన్ని ఎంత ఓపెన్ గా అయినా చెప్పేందుకు వెనుకాడడు. ఇప్పుడు గ్యారేజ్ నచ్చిందంటూ ప్రశంసలు కురింపించడానికి కారణం అదే.


ఈ సినిమా ఇటు సాధారణ ప్రేక్షకులనే కాక ఇటు సినీ పరిశ్రమ లోని పెద్దలని కూడా ఆకట్టుకుంటుంది.ఇప్పటికే రాజమౌళి ఈ సినిమా అద్భుతమని చెప్పగా ఈ లిస్టు లోకి అగ్ర హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ చేరారు. ఇక జనతా గ్యారేజ్ సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్.. ఇవాళ సాయంత్రం ఆ మూవీ యూనిట్ కి గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఇండస్ట్రీ పెద్దలతో పాటు గ్యారేజ్ తో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ వేడుక స్పెషల్ గా మిగిలిపోనుంది.

English summary
Janatha Garage has now been applauded by Victory Venkatesh. The senior hero posted on his Facebook page, “Watched Janatha Garage. A wholesome family emotional drama. Great performances from NTR and Mohanlal. Congrats to the whole team.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu