»   »  కృష్ణతో సినిమా చేసినప్పుడు.. ఆరోజు సెట్ లోనే ఏడ్చేశా..: ఇంద్రజ

కృష్ణతో సినిమా చేసినప్పుడు.. ఆరోజు సెట్ లోనే ఏడ్చేశా..: ఇంద్రజ

Subscribe to Filmibeat Telugu

ఒకప్పటి అందాల తార ఇంద్రజ తాజాగా ఓ టీవి చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తాను సినిమాల్లోకి వచ్చిన తొలిరోజులను గుర్తుచేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణతో నటించిన ఓ సినిమా సందర్భంగా తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ 'అమ్మ దొంగ' సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహించారని, తనకు కబురు వస్తే వెళ్లానని ఇంద్రజ అన్నారు. తీరా అక్కడికెళ్లాక.. దర్శకుడు సాగర్ తనను చూసి .. 'ఈ అమ్మాయి మరీ చిన్నపిల్లలా వుంది' అంటూ తిప్పి పంపించేశారని గుర్తుచేసుకున్నారు.

 hero indraja remembered a incident that she cried in shooting location

అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ తనకు మళ్లీ కబురు వచ్చిందన్నారు. షూటింగ్ బాగానే జరిగిందని, కానీ హీరో కృష్ణ గారు మాత్రం ఎప్పుడూ ఏమి మాట్లాడలేకపోయేవారని అన్నారు. ఆయన అలా మౌనంగా ఉండటం చూసి.. 'బహుశా.. నా పెర్ఫామెన్స్ బాగాలేదేమో' అని తాను మనస్తాపం చెందినట్టు చెప్పారు.

అంతేకాదు, ఓరోజు ఇదే మనస్తాపంతో సెట్ లోనే ఏడ్చేశానని గుర్తుచేసుకున్నారు. తాను సరిగా చేయనందువల్లే ఆయన మాట్లాడట్లేదన్న భావనలో తాను ఉండిపోయానని అన్నారు. అయితే తన ఏడుపు చూసి మేకప్ మేన్ .. హెయిర్ డ్రెస్సర్ అంతా వచ్చి తనకు నచ్చజెప్పారని అన్నారు.

కృష్ణగారు చాలా సైలెంట్ గా ఉంటారని, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని, ఆయనంతేనని చెప్పడంతో తాను ఏడుపు ఆపేసినట్టు చెప్పారు. ఆ తర్వాత కృష్ణగారు ఎంత సింపుల్ గా వుంటారనేది తెలిశాక తాను ఆశ్చర్యపోయానని ఇంద్రజ స్పష్టం చేశారు.

English summary
Former Heroine Indraja recently given an interview to Tv channel, on this eve she remembered a bitter experience in her career begining
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu