Just In
- 7 min ago
బ్లాక్‌లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
- 1 hr ago
షూటింగ్‌కు సిద్ధమైన మహేశ్ డైరెక్టర్: ఆ తరహా కథతో ప్రయోగం చేయబోతున్నాడు
- 1 hr ago
ఆ డబ్బులేవో నువ్వే ఇవ్వొచ్చు కదా?.. యాంకర్ సుమ పోస్ట్‌పై నెటిజన్ల కామెంట్స్
- 1 hr ago
గ్యాప్ తర్వాత అదరగొట్టేసిన అమలా పాల్: ఆమెను అలా చూసి ఆశ్చర్యపోవడం ఖాయమట
Don't Miss!
- Sports
క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒకే బంతికి ఒకే బ్యాట్స్‌మన్ రెండు సార్లు రనౌట్! వీడియో
- News
ఎన్నికల వేళ కేంద్రం మరో తాయిలం -బోడో రీజియన్‌కు రూ.500 కోట్లు -అస్సాంలో అమిత్ షా ప్రకటన
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మళ్ళీ ఇంకో రెండా...?మరి సమంత సంగతేంటి?... నాగ చైతన్యా ఇంకెన్నాళ్ళిలా..??
కొన్నాళ్ళ క్రితం వరకూ అంటే పవన్ కళ్యాన్, మహేష్ బాబూ, తారక్ ల టైం లో సినిమాలు కాస్త స్లోగానే చేసేవారు మహా అయితే సంవత్సరానికి ఒక సినిమా వచ్చేది. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారింది. కుర్ర హీరోలు ప్రవాహం లా వచ్చేసారు సినిమాల జోరు పెంచారు. అదే దారిలో నాగచైతన్య కూడా ఈ ఏడాది చాలా సినిమాలే చేస్తున్నాడు. సాహసమే శ్వాసగా సాగిపో, ప్రేమమ్ రీమేక్ లో నటిస్తున్న చైతూ ఇంకో రీమేక్ లో నటించటానికీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
ఈ మధ్య వరుస ఫ్లాపుల్లో ఉన్న నాగ చైతన్య కథల విసయం లో రిస్క్ తీసుకోవటానికి ఇష్ట పడటం లేదు. అననవసరంగా ప్రయోగాలెందుకు లెమ్మని మినిమం గ్యారెంటీ అయిన ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన కథలతోనే బండి లాగించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం రెండు ప్రేమకథా చిత్రాలలో నటిస్తున్నాడు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'సాహసం శ్వాసగా సాగిపో' మరియు 'ప్రేమమ్' రీమేక్. ఈ రెండు చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమయ్యాయి.
ఇదిలా ఉంటే మరో రెండు రీమేక్ సినిమాలను చైతు లైన్లో పెట్టినట్లు టాక్. తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'ఈట్టి' చిత్రాన్ని నాగచైతన్య రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. అంతే కాదు ఈ చిత్రంతో పాటు రీసెంట్ గా కోలీవుడ్ లో రిలీజ్ అయిన 'మెట్రో' చిత్ర రీమేక్ లో నటించేందుకు చైతు ఉత్సాహంగా ఉన్నాడట. ఈ రెండు రీమేక్ లతో పాటు 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నటించేందుకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాలొ హీరోయిన్ కూడా సమంతా అనే టాక్ వచ్చినా ఇప్పుడు మాత్రం ఆ ప్లేస్ ఖాళీ ఔతుందనీ... సమంత స్థానం లో ఇంకో హీరోయిన్ వస్తుందనీ అంటున్నారు.. అయితే ఈ విషయం లో ఇంకా క్లారిటీ లేదు
ఇలా వరుస సినిమాలతో చైతు ఫుల్ బిజీ కాబోతున్నాడు. అయితే "ఈట్టి" సినిమాలో చేయబోయేది మాత్రం చాలా చాలెంజింగ్ రోల్ నిజానికి ఈ సినిమా చైతూ లోని నటున్ని వెలికి తీయగలదు... మరి చైతూ ఏం చేస్తాడో చూడాలి... ఇంతకీ "ఈట్టి" సినిమా ప్రత్యేకథ ఏమిటీ..? చైతూ ఆపాత్రని ఎంతవరకూ మెప్పించగలడు??? తదితర వివరాలు స్లైడ్ షోలో...

నాగ చైతన్యా ఇంకెన్నాళ్ళిలా..?
నాగచైతన్య ఈ ఏడాది చాలా సినిమాలే చేస్తున్నాడు. సాహసమే శ్వాసగా సాగిపో, ప్రేమమ్ రీమేక్ లో నటిస్తున్న చైతూ కల్యాణ కృష్ణ చేయబోయే సినిమాలో కూడా యాక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు కల్యాణం అనే టైటిల్ ఆలోచనలో ఉంది.

నాగ చైతన్యా ఇంకెన్నాళ్ళిలా..?
ఇదిలా ఉండగా.. తమిళంలో విజయవంతమైన ‘ఈట్టి' సినిమాను చైతూ హీరోగా తెలుగులోకి రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. తమిళంలో అధ్వర్వ హీరోగా నటించిన సినిమా ఇది. రవి అరసు అనే కొత్త దర్శకుడు రూపొందించాడు.

నాగ చైతన్యా ఇంకెన్నాళ్ళిలా..?
ఈ తమిళ సినిమాకు డైరెక్టర్ రవి అరసు, తెలుగు రీమేక్ కు కూడా అరసు డైరెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమా ఓ వెరైటీ కథతో రూపొందింది.

నాగ చైతన్యా ఇంకెన్నాళ్ళిలా..?
ఓ అరుదైన వ్యాధి ఉన్న కుర్రాడు.. ఆ బలహీనతను అధిగమించి.. అథ్లెట్ గా ఎదగడం.. ఓ పెద్ద సమస్యలో చిక్కుకుని దాన్నుంచి బయటపడటం.. ఇలా సాగుతుంది కథ. ఈ కథను మొదట బన్నీకే వినిపించారు. కానీ ఎందుకో బన్నీ దాన్ని వద్దనుకున్నాడు. తర్వాత మేకర్స్.. ఇదే ప్రాజెక్టును చైతూకు చెప్పడం అతడు ఓకే అనడం జరిగిపోయాయి.

నాగ చైతన్యా ఇంకెన్నాళ్ళిలా..?
అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ తర్వాత దాని గురించి ఇంకే అప్ డేట్ లేదు. ఐతే చైతూతో మాత్రం ఈ రీమేక్ పక్కా అంటున్నారు.

నాగ చైతన్యా ఇంకెన్నాళ్ళిలా..?
తమిళంలో అధర్వ నిజంగానే అథ్లెట్ తరహాలో ట్రైనప్ అయ్యాడు. బాడీ కూడా అలాగే పెంచాడు. చైతూ కూడా ఈ పాత్ర కోసం మేకోవర్ కావాల్సి ఉంటుంది.

నాగ చైతన్యా ఇంకెన్నాళ్ళిలా..?
తమిళంలో తెలుగమ్మాయి శ్రీదివ్య హీరోయిన్ గా నటించింది. ముందు తెలుగులో కూడా ఈ అమ్మాయే అనుకున్నా మళ్ళీ వేరే హీరోయిన్ అయితేనే బావుంటుందనుకుంటున్నారట... అయితే ఈ విశయం ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు... చివరికి శ్రీదివ్యనే సీన్లోకి వచ్చినా రావొచ్చు..

నాగ చైతన్యా ఇంకెన్నాళ్ళిలా..?
ఇక చైతూ తో రీమేక్ కానున్న రెండో సినిమా తమిళ్ లోనే ఇటీవల విడుదలైన ‘మెట్రో'. సెన్సార్ సమస్యల్లో చిక్కుకుని కాస్త ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా తమిళనాట ప్రముఖుల ప్రశంసలు పొంది భారీ విజయం దిశగా దూసుకుపోతోంది.

నాగ చైతన్యా ఇంకెన్నాళ్ళిలా..?
మెట్రో నగరాల్లోని ప్రధాన సమస్యల్లో ఒకటైన చైన్ స్నాచింగ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఇప్పటికే కథా చర్చలు తుది దశకు చేరుకున్నాయట.తమిళ ‘మెట్రో' దర్శకుడు ఆనంద్ కృష్ణనే తెలుగు లో కూడా దర్శకత్వం చేయనున్నాడు

నాగ చైతన్యా ఇంకెన్నాళ్ళిలా..?
ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే తమిలం లో హీరోగా చేసిన శిరీష్ తెలుగు రీమేక్ లో మాత్రం విలన్ గా కనిపించనున్నాడు.

నాగ చైతన్యా ఇంకెన్నాళ్ళిలా..?
కొత్తకథలని నమ్ముకొని తీసే సినిమాలకంటే మినిమం గ్యారెంటీ అని నిరూపించుకున్న కథలనే ఎంచుకుంటున్న చైతూ సేఫ్ గేం ఆడటానికే నిర్ణయించుకున్నట్టున్నాడు.... ఇక రేమేక్ రాజా అయిపోయి కేవలం ఇతర భాషల్లో వచ్చిన సినిమాలనే ఎంచుకుంటూ ఉంటాడేమో..

నాగ చైతన్యా ఇంకెన్నాళ్ళిలా..?
ఈ రెండు రీమేక్ లతో పాటు ‘సోగ్గాడే చిన్ని నాయనా' చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నటించేందుకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాలొ హీరోయిన్ కూడా సమంతా అనే టాక్ వచ్చినా ఇప్పుడు మాత్రం ఆ ప్లేస్ ఖాళీ ఔతుందనీ... సమంత స్థానం లో ఇంకో హీరోయిన్ వస్తుందనీ అంటున్నారు.. అయితే ఈ విషయం లో ఇంకా క్లారిటీ లేదు ..