Just In
Don't Miss!
- News
రైతు సంఘాలతో కేంద్రం 10వ దఫా చర్చలు వాయిదా: జనవరి 19కి బదులు 20న భేటీ
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'సార్.. టచ్ చేయకండి అని ఆ ప్రొడ్యూసర్‌తో చెప్పా.. అప్పటి నుంచే నా మైండ్‌లో..'
సమంత, శర్వానంద్ జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త సినిమా 'జాను'. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా శనివారం రోజు హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాని.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. వివరాల్లోకి పోతే..

96 రీమేక్ మూవీ.. దిల్ రాజు నిర్మాణం
తమిళ నాట విడుదలై ఘన విజయం సాధించిన 96 చిత్రానికి రీమేక్ సినిమాగా 'జాను' ప్రేక్షకుల ముందుకొస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష లీడ్ రోల్స్ పోషించగా, ఈ రీమేక్ సినిమాలో సమంత, శర్వానంద్ లీడ్ రోల్స్ పోషించారు. ఒరిజినల్‌ను రూపొందించిన సి. ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. ఫిబ్రవరి 7న 'జాను' రిలీజ్ కానుంది.

మంచి ఫీల్ ఉన్న సినిమా కదా.. అందుకే
అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేదికపై నాని మాట్లాడుతూ.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన ఆడియన్స్‌లో మంచి ఎనర్జీ ఉంది. 'జాను' మంచి ఫీల్ ఉన్న సినిమా కదా.. ఆడియన్స్ కూడా అలాగే ఉంటారని అనుకున్నా అంటూ ఈ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పారు నాని.

టచ్ చేయకండి సార్ అన్నాను
దిల్ రాజు గారు 96 సినిమాను రీమేక్ చేద్దాం అని డిసైడ్ కాగానే నా ఒపీనియన్ అడిగారు. అప్పుడు నేను.. సార్ ఇంత మంచి సినిమాను టచ్ చేయకండి అన్నాను. విజయ్ సేతుపతి, త్రిషలు ఇంత బాగా చేశారు. వద్దు అనేశా. ఈ సినిమాపై ఎప్పుడు డిస్కషన్స్ వచ్చినా.. తెలుగుతో తీయకూడదనే చెప్పాను. కానీ సమంత, శర్వానంద్ చేస్తున్నారని తెలిసిన రోజు.. ఈ సినిమా తెలుగు వర్షన్ ఎప్పుడు చూడాలా అనే ఫీలింగ్ కలిగింది. ఆ నమ్మకం నాకు ట్రైలర్ చూశాక మరింత పెరిగిందని నాని పేర్కొన్నారు.

అప్పటి నుంచే నా మైండ్‌లో..
జాను ట్రైలర్ చూసినప్పటి నుంచే నా మైండ్‌లో ఉన్న తమిళ 96 మూవీ డిలీట్ అయింది. ఇప్పుడు 'జాను' అంటే నాకు శర్వా, సమంతలు గుర్తుకు వస్తున్నారు. ఫిబ్రవరి 7 నుండి మీకు కూడా ఇదే ఫీల్ వస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఫస్ట్ ఫ్రెండ్ శర్వానంద్. సినిమాలు చేసుకోవడమే కాదు.. అప్పుడప్పుడూ పాత ఫ్రెండ్స్‌ని ఇలా కలిస్తే బాగుంటుంది అని నాని చెప్పారు.