For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరు తర్వాత నా కోసం నాని వచ్చాడు, తమ్ముడూ నువ్వుబావుండాలి: సునీల్

  By Bojja Kumar
  |
  చిరు తర్వాత నాని నే..! | Filmibeat Telugu

  సునీల్, మ‌నీషా రాజ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 2 కంట్రీస్‌. మ‌హాల‌క్ష్మి ఆర్ట్స్ ప‌తాకంపై ఎన్‌.శంక‌ర్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో సినిమాను రూపొందించారు. గోపీసుంద‌ర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. హీరో నాని ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు.

   సునీల్ అన్న రికమండ్ చేయబట్టే నేను ఈ రోజు ఇలా ఉన్నానన్న నాని

  సునీల్ అన్న రికమండ్ చేయబట్టే నేను ఈ రోజు ఇలా ఉన్నానన్న నాని

  ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.... నాకు సునీల్ అన్న అంటే చాలా ఇష్టం. ‘ఢీ' సినిమాకు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్‌గా రికమండ్ చేసింది సునీల్ అన్నే. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈ రోజు ఇక్కడి వరకు వచ్చాను అని నాని తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో యాక్టర్స్ దగ్గరకు వెళ్లి మాట్లాడాలంటే ఒక భయం ఉండేది. అప్పటికే సునీల్ అన్న పెద్ద స్టార్ యాక్టర్. క్లాప్ అసిస్టెంట్ గా ఉన్న నాతో ఆయన ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడి కాన్ఫిడెన్స్ ఇచ్చారు.... అని నాని తెలిపారు.

   మా సునీల్ అన్న సినిమా కాబట్టి ఇంకా పెద్ద హిట్టవ్వాలి

  మా సునీల్ అన్న సినిమా కాబట్టి ఇంకా పెద్ద హిట్టవ్వాలి

  సునీల్ అన్న రికమండ్ చేస్తే అసిస్టెంటుగా చేరిన నేను ఆయన నటించిన ఈ సినిమా ఈ వెంటులో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంటర్టెన్మెంట్ సైడ్ ఎలాగూ సునీల్ అన్నయ్య అదరగొడతాడు. కంటెంట్ సైడ్ చూస్తే ‘2 కంట్రీస్' అనేది మలయాళంలో చాలా పెద్ద సక్సెస్. కంటెంట్ తప్పకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అన్ని సినిమాలు బాగా ఆడాలి. ఇది మా సునీల్ అన్న సినిమా కాబట్టి ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.... అని నాని తెలిపారు.

  నాకు దిలీప్ సినిమాలు బాగా సూటవుతాయి: సునీల్

  నాకు దిలీప్ సినిమాలు బాగా సూటవుతాయి: సునీల్

  మలయాళం స్టార్ దిలీప్ గారి సినిమాలు నాకు సూట్ అవుతాయి. కానీ ఆయన సినిమాలు తెలుగులో ఇప్పటి వరకు ఒకటే చేశాను. అదే ‘పూలరంగడు'. దాని తర్వాత ‘2 కంట్రీస్' సినిమా చేశాను. ఆ సినిమాకు, ఈ సినిమాకు శ్రీధర్ సీపాన డైలాగ్స్ రాశాను. శంకర్ గారు ఈ సినిమా చేయాలనుకోవడం ప్లస్సయింది. ఆయన లాస్ట్ వరకు పట్టు వదలకుండా చాలా హై రేంజిలో, హై క్వాలిటీతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా అద్భుతంగా ఈ సినిమా చేశారు. ఈ సినిమా ద్వారా చాలా మంచి లైఫ్ ఇస్తున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్ గారు మంచి సంగీతం ఇచ్చారు... అని సునీల్ అన్నారు.

   చిరంజీవిగారి తర్వాత నాని వచ్చాడు

  చిరంజీవిగారి తర్వాత నాని వచ్చాడు

  ఈ సినిమా ఫస్ట్ టీజర్ పవన్ కళ్యాణ్ గారు విడుదల చేశారు. అక్కడి నుండి అంతా పాజిటివ్ గానే జరుగుతోంది. ఇపుడు నాని వచ్చి ఈ ఆడియో రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం సంతోషం. ఎందుకంటే ఆయన ఎయిర్ పోర్టులో షూటింగ్ చేసి అక్కడి నుండి బయల్దేరి ఇక్కడకు వచ్చారు. అప్పట్లో జక్కన్న ఫంక్షన్ సమయంలో చిరంజీవిగారు షూటింగ్ నుండి వచ్చారు. ఆయన తర్వాత నా కోసం షూటింగ్ నుండి వచ్చింది నాని మాత్రమే. నాని తమ్ముడూ... నువ్వు ఇప్పుడు సక్సెస్ అయినదానికంటే వందరెట్లు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నువ్వు బావుండాలి... అని సునీల్ వ్యాఖ్యానించారు.

  బండ్ల గణేష్ కొన్నాడు, కానీ చివరకు నాకే వచ్చింది

  బండ్ల గణేష్ కొన్నాడు, కానీ చివరకు నాకే వచ్చింది

  డైరెక్ట‌ర్ ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ - ``ప‌వ‌ర్‌కి, నేచుర్‌కి చాలా ద‌గ్గ‌ర సంబంధం ఉంది. మా సినిమా టీజ‌ర్‌ను ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విడుద‌ల చేశారు. ఆ టీజ‌ర్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 40 ల‌క్ష‌ల మంది చూశారు. అలాగే సినిమా పాట‌ల‌ను నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేశారు. కాబ‌ట్టి సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది. ముందు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌నుకోగానే..సునీల్ అయితేనే చేయాల‌ని ముందుగా అనుకున్నాను. ఆ రైట్స్ కొనాల‌ని అనుకుంటున్న త‌రుణంలో బండ్ల గ‌ణేష్ రైట్స్‌ను ద‌క్కించుకున్నాడు. స‌రేన‌ని కామ్‌గా అయిపోయాను. ఈ సినిమాను తెలుగులో నేనే చేయాల‌ని రాసి ఉందేమో..అటు, ఇటు తిరిగి నా ద‌గ్గ‌ర‌కే వ‌చ్చింది. చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా క‌దా అని ఆలోచించి సినిమా చేశాను.... అని ఎన్ శంకర్ తెలిపారు.

   హార్ట్ ట‌చింగ్‌తో పాటు హ్యూమ‌న్ వాల్యూస్ ఉన్న చిత్ర‌ం

  హార్ట్ ట‌చింగ్‌తో పాటు హ్యూమ‌న్ వాల్యూస్ ఉన్న చిత్ర‌ం

  సునీల్ ఒక ట్రాన్స్‌ఫ‌ర్మ‌ర్‌ లాంటోడు. త‌ను ఓన్ చేసుకుని న‌టించాడు. రేపు సినిమా చూసిన వారంద‌రికీ సునీల్ త‌ప్ప‌కుండా గుర్తుంటాడు. శంక‌ర్‌కి, సునీల్‌కు ఈ సినిమా గ్రేట్ జ‌ర్నీ కావాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకున్నారు. హార్ట్ ట‌చింగ్‌తో పాటు హ్యూమ‌న్ వాల్యూస్ ఉన్న చిత్ర‌మిది. చీక‌టిని చీక‌టి జ‌యించ‌దు. వెలుగే జ‌యిస్తుంది. అలాగే ద్వేషాన్ని ద్వేషం జ‌యించ‌దు. ప్రేమ మాత్ర‌మే జ‌యిస్తుంది. ఇప్ప‌టి యువ‌త వేగ వంత‌మైన జీవితంలో ప‌డి చాలా విష‌యాల‌ను మ‌ర‌చిపోతున్నారు. అందులో నిజ‌మైన ప్రేమ ఒక‌టి. నిజ‌మైన ప్రేమ గుండెను తాకితే ఎలా ఉంటుందో తెలిపే చిత్ర‌మే ఇది.. అని ఎన్ శంకర తెలిపారు.

  English summary
  2 Countries Movie Audio Launch event held at Hyderabad. Nani, Sunil, Deepa Naidu, Gopi Sundar, N Shankar, BVS RAvi, Dasarath, Raja Ravindra, Bhaskarabhatla, Y Kasi Viswanath, Prudhvi Raj, Srinivasa Reddy, Anil Ravipudi, Gemini Kiran, Malkapuram Shivakumar at the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X