»   » చేపల పులుసు వండుతూ నారా రోహిత్‌ (ఫొటో)

చేపల పులుసు వండుతూ నారా రోహిత్‌ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హీరో నారా రోహిత్‌ తన కొత్త సినిమా 'సావిత్రి' చిత్ర బృందం కోసం చేపల పులుసు వండారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలుపుతూ... ఫొటోను పోస్ట్‌ చేశారు.

Outdoor shoot is always fun. Cooking being one of my many passions, made "Fish Pulusu" for my team on the sets today. Needless to say, they all loved it.

Posted by Nara Rohith on 23 November 2015

వంటలు వండటం తన అభిరుచుల్లో ఒకటని, తాను తయారు చేసిన చేపల పులుసు అందిరికీ నచ్చిందన్నారు. అవుట్‌ డోర్‌ షూటింగ్‌ ఎప్పుడూ సరదాగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 'సావిత్రి' చిత్రం షూటింగ్‌ పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు మండలంలో జరుగుతోంది.

Hero Nara Rohith Turns A Chef

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలోని ఇంద్రావనం ప్రాంతంలో 'సావిత్రి' సినిమాకు సంబంధించిన పాటల షూటింగ్ జరిగింది. హీరో నారా రోహిత్‌, హీరోయిన్ నందితలు నృత్య దర్శకుడు గణేశ్‌ సూచనల మేరకు నృత్యాలు చేశారు. వీరితో పాటు డాన్సర్లు పాల్గొన్నారు. దర్శకుడు సాదినేని పవన్‌ చిత్ర నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ షూటింగ్ చూసేందుకు ప్రజలు తరలివచ్చారు.

English summary
Nara Rohith taking showing his culinary skills during the ongoing East and West Godavari schedules of his upcoming film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu