»   » హీరో రాజా..తండ్రి అయ్యారు (ఫొటో)

హీరో రాజా..తండ్రి అయ్యారు (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆనంద్, వెన్నెల లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రాజా క్రితం సంవత్సరం వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఇప్పుడు పండంటి బేబి గర్ల్ కు తాను తండ్రిని అయ్యానంటూ మురిసిపోతూ ఆ ఫొటోని సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేసారు. అతని భార్య అమృతా విన్సెంట్, తను ఈ ముద్దుల బేబిని చూసి మురిసిపోతున్నారు. మీరు ఇక్కడ ఆ ఫొటోని చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

గత సంవత్సరం రాజా... చెన్నైకి చెందిన అమృత విన్సెంట్ ని పెళ్లాడారు. వీరి వివాహానికి పలువురు ప్రముఖులు హారయ్యారు. చెన్నైలోని ఓ చర్చిలో క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం వీరి వివాహం జరిగింది. అనంతరం సినీ ప్రముఖుల కోసం గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేసారు. అమృత తండ్రి ఫెడ్రిక్ విన్సెంట్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు క్లోజ్ ఫ్రెండ్.

Hero Raja becomes Father

శేఖర్ కమ్ముల ఆనంద్ చిత్రంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హీరో రాజా. ఆ చిత్రం తర్వాత దాదాపు ఓ పది చిత్రాల్లో నటించినా హిట్ రాలేదు.దాంతో వరస ప్లాపుల హీరోకు తెలుగు సినిమా బ్రేక్ ఇచ్చి ఇంట్లో కూర్చో పెట్టింది. దాంతో మరీ ఖాళీ పడిపోయామని గమనించిన రాజా ఆ మధ్య తన దృష్టిని తెలివిగా టీవీ యాంకరింగ్ వైపు తిప్పారు. అదీ కలిసి రాలేదు.

ఇక రాజా ఖాళీ పడటానికి కారణాలు అనేకం.ముఖ్యంగా సినిమాలు వరసగా ప్లాప్ అవటం కారణం. వీటితో పాటు సక్సెస్ రేటు లేకున్నా రెమ్యునేషన్ మాత్రం భారీగా అడగటం జరిగింది. మరో ప్రక్క శాటిలైట్ మార్కెట్ కూడా రాజా అస్సలు లేకుండా పోయింది. దాంతో రాజా అంటే ఏ దర్శకుడూ, నిర్మాత ధైర్యం చేయటం లేదు.

English summary
Hero Raja and his Wife Amrita Vincent were blessed with a baby girl. Sharing the picture of his new born, Raja expressed his happiness.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu