»   » హీరో రాజా ఆత్మహత్య ప్రయత్నం

హీరో రాజా ఆత్మహత్య ప్రయత్నం

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన సినిమాను అర్ధంతరంగా రద్దు చేస్తున్నారని తట్టుకోలేక హీరో రాజా ఆత్మహత్య ప్రయత్నం చేశాడని, ఆయన్ని ఆసుపత్రి నుంచి నేరుగా ఇక్కడకు తీసుకువచ్చానని తెలంగాణ నేత హనుమంతరావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కు చెప్పారు.రాజా హీరోగా క్రితం వారం 'ఇంకోసారి' అనే చిత్రం రిలీజైంది. కల్యాణ్‌ పల్లా నిర్మించిన ఈ చిత్రం మల్టి ఫ్లెక్స్ మూవీ అనే టాక్ తెచ్చుకుంది. అందులోనూ చాలా సెంటర్లలలో కలెక్షన్స్ డ్రాప్ అవటంతో దాన్ని తీసేసారు. దాంతో హీరో రాజా, నిర్మాత కల్యాణ్‌ పల్లా, తెలంగాణ నేత హనుమంతరావుతో కలిసి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ని కలిసారు. తాను హీరోగా నటించిన 'ఇంకోసారి' చిత్రాన్ని వారం కూడా ఆడనివ్వకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిలిపివేస్తున్నామంటూ థియేటర్‌ యాజమాన్యాల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తమబోటి చిన్నచిత్రాల నటులు, నిర్మాతలకు రక్షణ కల్పించాలని కోరారు.

అలాగే సినీ పరిశ్రమ కొందరి కబంధహస్తాల్లో కీలుబొమ్మగా మారిపోయిందని, చిన్న చిత్రాలను ఉద్దేశపూర్వకంగా చంపేస్తున్నారని సినీహీరో రాజా ఆరోపించారు. అయితే ఫిర్యాదును పరిశీలించిన కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి..'మీరిచ్చిన పిటిషన్‌ హక్కుల కమిషన్‌ పరిధిలోకి వస్తుందా..? థియేటర్లు కలెక్టర్ల పరిధిలోకి వస్తాయి. స్క్రీనింగ్‌, ఇతరాత్ర అంశాలు సెన్సార్‌ బోర్డు పరిధిలోనివి. అయితే మీ మీద సానుభూతి ఉంది. కానీ నాపరిధులు చూడాలి కదా.. మీరిచ్చిన ఫిర్యాదు పూర్తిగా సివిల్‌ తగాదా కాబట్టి దీనిని స్వీకరించే విషయమై పూర్తిగా అధ్యయనం చేసి గురువారం నిర్ణయం చెబుతా'మని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ...హనుమంతరావు మాట్లాడుతూ తన సినిమాను అర్ధంతరంగా రద్దు చేస్తున్నారని తట్టుకోలేక రాజా ఆత్మహత్య ప్రయత్నం చేశాడని, ఆయన్ని ఆసుపత్రి నుంచి నేరుగా ఇక్కడకు తీసుకువచ్చానని కమిషన్‌కు చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu