»   »  'బాహుబలి‌' గురించి హీరో రామ్ ఇలా...

'బాహుబలి‌' గురించి హీరో రామ్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్‌ చిత్రం 'బాహుబలి-ద బిగినింగ్‌' భారీ రికార్డులను కూడా సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సినిమా ప్రముఖులు చూసి మెచ్చుకుంటున్నారు. ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని రామ్ చూసారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఈ చిత్రం గురించి మాట్లాడారు. ఆయనేం స్పందించారో మీరు ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుఫైనల్ గా బాహుబలి ని చూసాను.ఐమాక్స్ లో చూడటానికి వెయిట్ చేసాను. రాజమౌళి గారు ఓ పుస్తకం కాదు...ఆయనో లైబ్రరీ..ఎపిక్ ఫిల్మ్ అన్నారు.ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క...అలాగే కన్నప్ప సత్యరాజ్ గారు ఫెంటాస్టి్క్ గా చేసారు...

అలాగే అఫ్ కోర్స్ రమ్యకృష్ణ గారు ...ఒకే ఒక నటి..హీరోయిన్ గా , హౌస్ వైఫ్ గా, విలన్ గా, దేవతగా.....ఆవిడ పార్ట్ అద్బుతం అంటూ రామ్ ట్వీట్ చేసారు.


Hero Ram tweet about Baahubali


చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే...


ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
రూ.100కోట్లు.. 200.. 300.. కోట్లు దాటిపోయింది. ప్రస్తుతం బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా రూ.355కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఇంకేముంది రూ.500కోట్ల కలెక్షన్‌ సినిమాలో జాబితాలో చేరేందుకు దూసుకెళ్తోంది.


అంతేకాదు బాలీవుడ్‌లో అధిక వసూళ్లు సాధించిన సినిమాలతో పోటీ పడుతోంది. జులై 17న విడుదలైన బాలీవుడ్‌ సినిమా 'భజరంగీ భాయీజాన్‌' ప్రపంచవ్యాప్తంగా రూ.226కోట్లు వసూలు చేసి ప్రస్తుతం బాహుబలికి గట్టి పోటీ ఇస్తోంది.


ఇక బాహుబలి సినిమా విడుదలైన తొలి రోజు నుంచే రికార్డులు బద్ధలు కొడుతూనే ఉంది. జులై 10 శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన బాహుబలి ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.68కోట్ల షేర్‌ వసూలు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది భారతీయ చిత్ర పరిశ్రమ రికార్డుగా చెప్తున్నారు.


బాలీవుడ్‌లో షారూక్‌ ఖాన్‌ నటించిన 'హ్యాపీ న్యూ ఇయర్‌' సినిమా తొలి రోజు రూ.65కోట్ల షేర్‌ సాధించినట్లు సమాచారం. దీంతో బాలీవుడ్‌ తొలిరోజు రికార్డులను బద్ధలు కొట్టేసింది.
English summary
Hero Ram watched Baahubali starring Prabhas,Rana,Tamanna and Anushka. After the film he shared his experience with the following tweet. Finally got to watch #Baahubali ..waited all this while to watch it on IMAX.. ssrajamouli isn't a Book..he's an effin Library!!EPIC FILM!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu