»   » బండ్ల గణేష్ మనిషి కాడు.. తోడేలు.. తిండి లేదని ఏడ్చాడు.. సచిన్

బండ్ల గణేష్ మనిషి కాడు.. తోడేలు.. తిండి లేదని ఏడ్చాడు.. సచిన్

Written By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌పై హీరో సచిన్ జోషి విరుచుకుపడ్డారు. ఆయనను నమ్మి సినిమా చేయడం తన తప్పు అని పేర్కొన్నాడు. రూ.27 కోట్లు ఎగవేతకు పాల్పడ్డాడని సచిన్ ఆరోపించారు. సచిన్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం 'వీడెవడు'. సోమవారం ఈ చిత్రం టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు బండ్ల గణేష్‌ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా సచిన్‌ జోషి ఈ విధంగా స్పందించారు.

రూ. 27 కోట్లు ఇవ్వాలి

రూ. 27 కోట్లు ఇవ్వాలి

‘బండ్ల గణేష్‌ మనిషి కాడు.. తోడేలు లాంటివాడు. ఎవడినైతే నమ్మకూడదో వాడితోనే వ్యాపారం చేశా. రూ.27 కోట్ల దాకా ఇవ్వాలి. అతడి మీద మొత్తం 14 కేసులు కోర్టులో దాఖలు చేశాం అని సచిన్ తెలిపారు. గణేష్‌ను అరెస్ట్ సమయానికి ఆయన తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడంతో జాలిపడి వదిలేశానని వెల్లడించారు.

బండ్ల గణేష్ తిండికి లేదని ఏడ్చాడు..

బండ్ల గణేష్ తిండికి లేదని ఏడ్చాడు..

‘ఒరేయ్‌ పండు' సినిమా షూటింగ్‌ సమయంలో తినడానికి తిండి లేదని గణేశ్ అన్నాడు. నమ్మించి నన్ను మోసగించాడు. ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో నాపై ఆరోపణలు చేయడం తగదు. గణేశ్‌తో కోర్టులో తేల్చుకొంటాం' అని సచిన్‌ జోషి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

సచిన్‌పై గణేశ్ ఆరోపణలు

సచిన్‌పై గణేశ్ ఆరోపణలు

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు నిర్మాత బండ్ల గణేష్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో సచిన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సచిన్‌ జోషిని ఉద్దేశించి వివాదాస్పదంగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సచిన్‌తో సినిమా చేయడం బుద్ధి తక్కువ పని. బుద్ది ఉన్నోడు ఎవడైనా ఆయనతో సినిమాలు చేస్తాడా అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు.

చంపమని నయీంకు చెప్పాడు..

చంపమని నయీంకు చెప్పాడు..

అంతేకాకుండా సచిన్‌ జోషి తనను చంపమని గ్యాంగ్‌స్టర్‌ నయీంకి చెప్పాడు. అతను చనిపోవడంతో ఆయన పరిస్థితి కూడా అయిపోయింది అని బండ్ల గణేశ్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా సచిన్ జోషి కౌంటర్ ఇవ్వడం ఈ వివాదం మళ్లీ జోరందుకున్నది.

English summary
Hero Sachin Joshi fires on Producer Bandla Ganesh. He made serious allegations on Ganesh. He said cheated Rs.27 Crores. Sachin's new moview Veedevadu teaser released today.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu