»   » ఉదయ్ కిరణ్ ది అనుమానాస్పద మృతి (ఫోటోలతో..)

ఉదయ్ కిరణ్ ది అనుమానాస్పద మృతి (ఫోటోలతో..)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఆత్మహత్య చేసుకున్న సినీ హీరో ఉదయ్‌కిరణ్‌ నివాసంలో క్లూస్‌ టీం తనిఖీలు ముగిశాయి. ఆయన వాడే ల్యాప్‌టాప్‌, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై పోలీసులు స్పందించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమేదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక జూబ్లీహిల్స్‌లోని తన సొంత ప్లాట్‌లో ఉరి వేసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆయనను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఉదయ్‌కిరణ్ మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.

ఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ లభ్యం కాలేదని... పోస్టు మార్టం నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఉరి వేసుకునే ముందు భార్య సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపిచారని తెలిపారు.

మిగతా వివరాలు స్లైడ్ షోలో.

ఆరాలు...

ఆరాలు...


ఉదయ్ కిరణ్ ... ఆత్మహత్యకు ముందు ఎవరెవరితో మాట్లాడారన్న దానిపై ఏసీపీ అశోక్ కుమార్ ఆరాతీస్తున్నామన్నారు. అప్పుడే పూర్తి వివరాలు చెప్పగలమన్నారు.

అందుకే ఆత్మహత్యా

అందుకే ఆత్మహత్యా

ఆర్ధికంగా ఇబ్బందులుతో పాటు, కెరీర్ సరిగా లేకపోవటంతో మనస్తాపం చెందే ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు.

పోస్ట్ మార్టం...

పోస్ట్ మార్టం...

మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పటిల్ కు తరలిస్తున్నామన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలియచేస్తామని అన్నారు.

వాచ్ మెన్ ఏమన్నారు..

వాచ్ మెన్ ఏమన్నారు..

హీరో ఉదయ్‌కిరణ్‌ ఉరివేసుకున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేరని అపార్టమెంట్‌ వాచ్‌మెన్‌ కృష్ణ పోలీసులకు తెలిపాడు. ఉదయ్‌కిరణ్‌ భార్య రాత్రి 8 గంటల సమయంలో ఓ వేడుకలో పాల్గొనేందుకు బయటకు వెళ్లారని చెప్పాడు.

హడావిడిగా...

హడావిడిగా...

రాత్రి ఒంటిగంట సమయంలో భార్య, అత్తమామలు హడావిడిగా ఇంటికి చేరుకున్నారని... అనంతరం అరుపులు విన్పించాయని వివరించారు. అనంతరం వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించామన్నారు.

క్లూస్ అధికారి ఏమన్నారు..

క్లూస్ అధికారి ఏమన్నారు..

ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు ప్రాధమికంగా తెలుస్తోందని ఏసీపీ అశోక్ కుమార్ తెలిపారు. ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపిస్తోందని క్లూస్‌ టీం అధికారి వెంకన్న చెప్పారు.

హీరో శ్రీకాంత్...

హీరో శ్రీకాంత్...

ఉదయ్‌కిరణ్‌ మృతి పట్ల హీరో శ్రీకాంత్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు భూపాల్‌ అనే వ్యక్తి ద్వారా సమాచారం అందిందన్నారు. ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడో తెలియడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఉదయ్‌కిరణ్‌ తండ్రి అందుబాటులోనే ఉన్నారని చెప్పారు.

స్టార్ గా వెలిగి...

స్టార్ గా వెలిగి...

ఉషాకిరణ్‌మూవీస్‌ బ్యానర్‌లో తేజ దర్శకుడిగా తెరకెక్కించిన 'చిత్రం' సినిమాతో ఉదయ్‌కిరణ్‌ వెండితెరకు పరిచయమయ్యారు. నువ్వునేను, మనసంతా నువ్వే, శ్రీరాం చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. 2001లో వచ్చిన 'నువ్వు-నేను' చిత్రానికి ఉత్తమ కథానాయకుడిగా ఫిలిం ఫేర్‌ అవార్డు దక్కించుకున్నారు. 2012 అక్టోబర్‌ 24న విషితను ఉదయ్‌కిరణ్‌ వివాహం చేసుకున్నారు.

దిగ్భ్రాంతి

దిగ్భ్రాంతి

ఉదయ్‌కిరణ్‌ మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినీనటులు శ్రీకాంత్‌, తరుణ్‌, ఆర్యన్‌రాజేశ్‌, శివాజీ, సంగీత దర్శకుడు ఆర్పీపట్నాయక్‌, అపోలో ఆస్పత్రికి చేరుకుని ఉదయ్‌కిరణ్‌ మృతదేహాన్ని సందర్శించారు. మృతికి గల కారణాలపై విచారణ జరపాలని శ్రీకాంత్‌ పోలీసులను కోరారు.

హీరో మంచు మనోజ్ స్పందిస్తూ...

హీరో మంచు మనోజ్ స్పందిస్తూ...

Soo sad to hear one of my good friend Uday Kiran is No more ... God pl give strength to their family ...RIP babai... Will miss u alot:(

నివాళి

నివాళి


తెలుగులో ఒక వెలుగు వెలిగి...ఫేడ్ అవుట్ అయిన ఉదయ్ కిరణ్ ...మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెడతారని అంతా భావిస్తున్న ఈ సమయంలో అతని మరణం తీరని లోటే. అతని మృతికి telugu.oneindia.in నివాళిలు అర్పిస్తోంది.

English summary
Hero Uday kiran commits suicide. As the for the early news indicates that Uday Kiran has committed suicide tonight around 12:15 AM IST in his flat at Srinagar colony. The doctors at Appolo Hospital have confirmed that it was too late to save him and pronounced him dead. The reason behind his death is still unknown.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu