»   »  కిడ్నాప్ కేసులో తెలుగు హీరో

కిడ్నాప్ కేసులో తెలుగు హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vallaba
'ఎవరే అతగాడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిర్మాత కె.యస్.రామారావు కుమారుడు అలగ్జాండర్ వల్లభ కిడ్నాప్ కేసులే ఇరుక్కున్నారు. కె.యస్.రామారావు బంధువు అయిన రామ్మోహనరావు కుమార్తె సౌమ్య ఆ మధ్య ఓ తొమ్మది నెలలు ఆయన ఆఫీసులో పనిచేసిందిట. అప్పుడు మన అప్ కమింగ్ హీరో లవ్ లో పడ్డాడట. కాని వరసకు వాళ్ళిద్దరూ అన్నాచెళ్ళెళ్ళు అవుతారని పెద్దలు పెళ్ళికి అడ్డుపడ్డారట. అంతే కాకుండా ఆమె కు వేరొకరని ఇచ్చి పెళ్ళి చేసారట. కధ అంతవరకు బాగానే ఉంది గాని సౌమ్య తండ్రి వల్లభ పై కుకుట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కిడ్నప్ కేస్ పెట్టాడట. వివాహిత అయిన తన కుమార్తెను వల్లభ ఎత్తుకుపోయాడని దాని సారాంసమట. అందులో వల్లభ వల్ల తనకు ప్రాణభయం ఉందని కూడా ఉందిట.
కాని ఈ విషయం తెల్సిన దగ్గరవాళ్ళు సౌమ్య స్వయంగా తన ప్రియుడు వల్లభ దగ్గరకు వెళ్ళిందని కాపురం పెట్టిందని చెప్పుకుంటున్నారు. కేసు గొడవ ఎలా ఉన్నా కె.యస్.రామారావు మాత్రం 'బుజ్జిగాడు మేడిన్ చెన్నై' పంక్షన్ కి కూల్ గా వెళ్ళొచ్చాడట

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X