»   » వెంట పడింది, సెల్పీ తీసుకుంది: నమిత తీరుతో ఆటో డ్రైవర్ షాక్

వెంట పడింది, సెల్పీ తీసుకుంది: నమిత తీరుతో ఆటో డ్రైవర్ షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా స్టార్లు కనిపిస్తే అభిమానులు, సాధారణ ప్రేక్షకలు వారి వెంట పడటం, ఆటోగ్రాఫ్ ఇవ్వాలనో, ఒక్క సెల్ఫీ తీసుకుంటామనో ఇబ్బంది పెట్టడం మామూలే. అయితే చెన్నైలో మాత్రం ఓ సాధారణ ఆటో డ్రైవర్ విషయంలో మాత్రం రివర్స్ లో జరిగింది.

తమిళనాట బాగా పాపులర్ అయిన నటి నమిత.... ఓ ఆటో నడుపుతున్న డ్రైవర్ ను చూసి, ఆటోను ఫాలో చేసి, తన కారుతో ఆటోను అడ్డగించింది. ఈ హఠాత్పరిణామంతో కంగుతున్న ఆటో డ్రైవర్... కారులో నుండి ఏకంగా ఫిల్మ్ స్టార్ నమిత దిగి తన ఆటో వైపు తూసుకురావడం చూసి షాకైంది.

నమిత ఎందుకలా చేసింది?

నమిత ఎందుకలా చేసింది?

నమిత ఇలా చేయడానికి కారణం ఆటో నడుపుతున్నది మహిళా డ్రైవర్ కావడమే. ఆమెను చూసి నమిత ఆనందపడిపోయింది. వెంటనే తన కారుతో ఆ ఆటోను ఫాలో చేసి ఆ డ్రైవర్‌ దగ్గరకు పరిగెత్తి సెల్ఫీ తీసుకుంది.

ఆమెకు సెల్యూట్ చేసిన నమిత

ఆమెకు సెల్యూట్ చేసిన నమిత

ఓ పేద కుటుంబానికి చెందిన మధ్య వయసు మహిళ కుటంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడుపుతున్న వైనం నమితను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె ఆత్మవిశ్వాసానికి సెల్యూట్‌ చేసింది.

షాకైన డ్రైవర్

షాకైన డ్రైవర్

నమితతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడే చెన్నైలో నమితే తనతో సెల్పీ కోసం స్వయంగా రావడం చూసి ఆ ఆటో డ్రైవర్ షాకైంది. ఏది ఏమైనా నమిత చర్యను ఇతర సెలబ్రిటీలు, అభిమానులు ప్రశంసిస్తున్నారు.

నమిత మూవీస్

నమిత మూవీస్

కాగా... అధిక బరువు కారణంగా 2013 నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత...బరువు తగ్గి ఈ ఏడాది నుండే మళ్లీ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఆమె పొట్టు అనే తమిళ చిత్రం చేస్తోంది.

English summary
Check out photos: Heroine Namitha Selfie With Lady Auto Driver In Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu