»   » నాకు పిచ్చి అంటూ ఇలా పిచ్చిగా గంతులేసిందీ హీరోయిన్ (వీడియో)

నాకు పిచ్చి అంటూ ఇలా పిచ్చిగా గంతులేసిందీ హీరోయిన్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అవును', 'సీమటపాకాయ్' చిత్రాలతో హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది పూర్ణ. తాజాగా కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి హీరోగా శివరాజ్ ఫిలింస్ బ్యానర్‌పై శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో రూపొందిన 'జయమ్ము నిశ్చయమ్మురా'లో హీరోయిన్‌గా నటించటం తో పూర్ణ కెరీర్ మంచి మలుపు తీసుకుంది నెమ్మదిగా వస్తున్న అవకాశాలతో ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది పూర్ణ.

తెలుగు, తమిళ, మళియాళ, కన్నడం ఇండస్ట్రీలో నటిగా మంచిపేరు తెచ్చుకున్న హీరోయిన్ పూర్ణ. తెలుగులో పలు హిట్‌ సినిమాల్లో నటించిన ఈమె స్వతహాగా మంచి డాన్సర్‌. అయితే చిన్నప్పటి నుంచి ఓ డాన్స్‌ స్కూల్‌ నెలకొల్పాలనేది ఆమె కోరిక. పూర్ణకి మొదటి నుంచి భరత నాట్యం అంటే ఎంతో మక్కువ. కేరళకు చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించిన పూర్ణ కు భరతనాట్యం అంటే అమితమైన ఆసక్తి దాంతో సినిమాల్లోకి వచ్చేసిందట... ఇదంతా బాగానే ఉంది కానీ తాజా గా పూర్ణ చెప్పిన సంగతే జనాలని కాస్త అయోమయం లో పడేసింది.

Heroine poorna says am mental

తనకు పిచ్చిపట్టిందట. ఈ మాట అన్నది ఎవరు కాదు.. స్వయంగా ఆమే అన్న మాట అది. తెలుగులో అవును సినిమాతో ప్రేక్షకులకు బాగానే చేరువైంది పూర్ణ. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్, మలయాళం, కన్నడలోనూ తన ప్రతిభను చాటుకుంది. పలు హిట్ చిత్రాల్లో నటించిన పూర్ణ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది షామ్నా ఖాసిం అనే పేరుతో అయినా తర్వాత సినిమాల్లోకి వచ్చాక పూర్ణగా మారిపోయింది.

అయితే చాలా మంది సెలెబ్రిటీలు ఇటీవలి కాలంలో సెల్ఫీ వీడియోలు తీసి.. సోషల్ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి హీరోయిన్ పూర్ణ కూడా చేరింది. పూర్ణ మాత్రం కొంచెం వెరైటీగా తన సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. ''ఈ రోజంతా నేను పిచ్చిదాన్నే'' అంటూ ట్వీట్ చేసి తాను డాన్స్ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పెట్టేసింది.

English summary
Tollywood Heroyin Poorna who is played lead femele Roles in "Avunu" "Jayammu nischayammura" says am mental..
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu