For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rambha: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి లైవ్ లో రంభ.. కుమార్తె ఆరోగ్యంపై వీడియో

  |

  నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్-ఈవీవీ సత్య నారాయణ కాంబినేషన్ లో వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటి రంభ. ఆ తర్వాత బావగారు బాగున్నారా, అల్లుడా మజకా, బొంబాయ్ ప్రియుడు, హిట్లర్ తదితర చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన అందచందాలతో టాలీవుడ్ లో చాలాకాలంపాటు సత్తా చాటిన బ్యూటి రంభ. దేశముదురు వంటి పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ సైతం చేసి అలరించింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకున్న రంభ.. భర్తతోపాటు కెనడాలో సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. స్వల్ప గాయాలతో బయటపడిన రంభ తాజాగా మొదటిసారిగా లైవ్ లోకి వచ్చింది. ఈ వీడియోలో ఏం మాట్లాడిందన్న వివరాల్లోకి వెళితే..

  2010లో వివాహం..

  2010లో వివాహం..

  సౌత్ అండ్ నార్త్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన రంభ అసలు పేరు విజయ లక్ష్మి. సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీలంకకు చెందిన తమిళ బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ పద్మనాథన్ ను 2010 ఏప్రిల్ 10న వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి కెనడాలో సెటిల్ అయింది ఈ బ్యూటి. ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అప్పటి నుంచి తన ఫ్యామిలీతో చెందుతున్న అనుభూతులను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

  గాయాలతో బయటపడగా..

  గాయాలతో బయటపడగా..

  నవంబర్ 1న కెనడలో రంభ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రంభ తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకొస్తన్న సమయంలో ఆమె కారును ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. రంభ స్వల్ప గాయాలతో బయటపడగా ఆమె కుమార్తె సాషా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె కూతురు కోసం ప్రార్థించాలని సోషల్ మీడియా వేదికగా రంభ తెలియజేసింది.

   నా కూతురు పూర్తిగా కోలుకుంది..

  నా కూతురు పూర్తిగా కోలుకుంది..

  రంభ కుమార్తె సాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని కోరుతూ కొన్ని ఫొటోలను ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. దీని తర్వాత లైవ్ లోకి వచ్చిన రంభ తన కూతురు ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చింది. ''మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. నా కూతురు పూర్తిగా కోలుకుంది. నా కూతురికి నయం కావాలని మీరందరు ప్రార్థించడం సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులు, ఫ్రెండ్స్ కు చాలా కృతజ్ఞతలు'' అని పేర్కొంది.

  ఎలా ఉన్నారు మేడమ్..

  చాలా రోజులకు రంభ లైవ్ లో కనపడిపోయేసరికి అభిమానులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. ఎలా ఉన్నారు మేడమ్.. ఇండియాకు ఎప్పుడు వస్తారు.. అని కామెంట్స్ పెట్టారు. లైవ్ లో ఫ్యాన్స్ స్పందన చూసిన రంభ చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తాను తెలుగు అమ్మాయినే అని, కాకపోతే కెనడాలో సెటిల్ అయినట్లు పేర్కొంది. ఆమెకు సమారు 6, 7 భాషలు వస్తాయని.. ఎక్కడికి వెళ్లిన ఆ భాషలోనే మాట్లాడతానని తెలిపింది.

  నాతో పాటు పిల్లలు, నానమ్మ ఉన్నారు..

  తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో మాట్లాడి అందరికి ఐ లవ్యూ అంటూ కృతజ్ఞతలు తెలుపింది రంభ. ఇదిలా ఉంటే యాక్సిడెంట్ తర్వాత హీరోయిన్ రంభ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. 'ఇంటర్‌సెక్షన్ వద్ద మా కారుని మరో కారు వచ్చి ఢీకొట్టింది. కారులో నాతో పాటు పిల్లలు, నానమ్మ ఉన్నారు. అందరం స్వల్ప గాయాలతో బయటపడ్డాం. కానీ, సాషా ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. బ్యాడ్ డేస్.. బ్యాడ్ టైమ్.. తను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి' అని కోరింది.

  వందకుపైగా సినిమాల్లో..

  వందకుపైగా సినిమాల్లో..

  కాగా రంభ రాజేంద్ర ప్రసాద్-ఈవీవీ సత్య నారాయణ కాంబినేషన్ లో వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. సుమారు వందకుపైగా సినిమాల్లో రంభ అలరించింది. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ఆకట్టుకుంది. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో అలరించిన బ్యూటిఫుల్ రంభ సినిమాలకు దూరంగా ఉంటోంది.

  English summary
  Tollywood Heroine Rambha Get Out Of Accident In Canada With Small Injuries And Posted Live Video After Accident
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X