»   »  లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో హీరోయిన్ సంజన

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో హీరోయిన్ సంజన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సంజన లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. 104 గంటల పాటు సాగిన సైక్లింగ్ మారథాన్ లో పాల్గొనడం ద్వారా ఈ రికార్డు సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమాన్ని ఫేవర్ 104 ఎఫ్ఎం వారు ముంబైలో నిర్వహించారు. లాంగ్ టైం సాగిన సైక్లింగ్ మారథాన్ కార్యక్రమంలో తాను భాగం కావడం ఆనందంగా ఉందని సంజన సంతోషం వ్యక్తం చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘బుజ్జిగాడు' చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్రలో తెలుగు తెరకు పరిచయమైన సంజన ఆ తర్వాత తెలుగులో అడపా దడపా చిత్రాల్లో నటించినా పెద్దగా స్టార్ స్టేటస్ తెచ్చుకోలేక పోయింది. అయితే సినిమా ఫంక్షన్లు, ఫోటో షూట్లు, వివాదాలతో మాత్రం గుర్తింపు తెచ్చుకుంది.

Heroine Sanjana in Limca Book Of Records

బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రంలో తన క్యూట్ పెర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత సత్యమేవ జయతే, సమర్థుడు, పోలీస్, దుశ్శాసన, ముగ్గురు, యమహోయమ, జగన్ చిత్రాల్లో నటించిన సంజనకు ఒక్క హిట్టూ దక్కక పోవడంతో ఆమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు లేకుండా పోయాయి. కొన్ని చిన్న చిత్రాల్లో మాత్రం నటిస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో శివ కేశవ్, వన్స్ అపానె టైం, సరదా, అవును 2 చిత్రాల్లో నటిస్తోంది. కన్నడలో రెబల్, బెంగులూరు 23, మళయాలంలో ఓ సినిమా చేస్తోంది.

ఇటీవల సంజన కల్లు (తాటి, ఈత చెట్టు నుండి తీసేది) తాగుతున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేసింది. తాజాగా సైక్లింగ్ మారథాన్ ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం....సినిమా షూటింగులు లేని సమయాన్ని ఖాలీగా గడపకుండా ఇలా పబ్లిసిటీ పెంచుకోవడానికి ట్రై చేస్తోంది సంజన.

English summary
Hot heroine Sanjana of Bujjigadu movie fame has entered the Limca Book of world records. She has finished 104 hours of cycling along with a big group of active cyclists to enter into this record.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu