twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సారీ టీచర్’పై హైకోర్టు స్టే...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహిళా టీచర్ల హుందాతనాన్ని దెబ్బతీసేదిగా, యువతను పక్కదారి పట్టించేదిగా ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 'సారీ టీచర్' చిత్రంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. మహిళా టీచర్ల గత కొంత కాలంగా ఈ చిత్రంపై ఆందోళన చేస్తున్నా..సెన్సార్ బోర్డు పట్టించుకోకుండా U/A సర్టిఫికెట్ జారీ చేసి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మహిళాటీచర్లు హైకోర్టు ఆశ్రయించగా...వారి పిటీషన్ పరిశీలించిన జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి స్టే విధించారు.

    ఆర్యమన్, కావ్యాసింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'సారీ టీచర్'. సూర్యలోక్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆనంద్ నిర్మిస్తున్నారు. శ్రీసత్య దర్శకుడు. కొంతకాలం క్రితం వరకు తెలుగు సినిమాలు వేరు, బూతు సినిమాలు వేరు. ఇప్పుడు నిర్మాణ ఖరీదు బాగా పెరగడంతో బూతు సినిమాలు తగ్గాయి. అయితే, కొందరు అలాంటి బూతు కథాంశంతో మెయిన్ స్ట్రీమ్ సినిమాలను నిర్మిస్తున్నారు. అలాంటి కోవలోకి వచ్చేదే "సారీ టీచర్" సినిమా.

    మహిళల వ్యక్తిత్వాన్ని దిగజార్చే, గురువులను అగౌరవ పరిచే పద్ధతుల్లో ఉన్న 'సారీ టీచర్‌' సినిమాను మొత్తానికే రద్దు చేయాలని, ఇకపై ఇలాంటి సినిమాలు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర కమిటీ, ఉపాధ్యాయ యూనియన్ యూటిఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

    అసభ్యకర సన్నివేశాలు, వేషాలతో గురు, శిష్యుల బంధాన్ని అపవిత్రం చేస్తున్న సినిమా అంటూ 'సారీ టీచర్'పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఇప్పటికే టీచర్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హెచ్ ఆర్ సికి ఇచ్చిన నివేదికలో గురు శిష్యుల బంధాన్ని అపహాస్యం చేస్తూ నిర్మించిన ఈ చిత్రాన్ని అనుమతించడాన్ని సెన్సార్ బోర్డు సమర్థించుకోవడంపై అప్పట్లో విమర్శలు వినిపించాయి.

    English summary
    Justice R Subhash Reddy of high court on Monday stayed the release of the now controversial Telugu movie 'Sorry Teacher'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X