»   » ఇది దేవీ కుమ్ముడు... దేవీశ్రీ ప్రసాద్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా??

ఇది దేవీ కుమ్ముడు... దేవీశ్రీ ప్రసాద్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సంగీత దర్శకుల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నది దేవిశ్రీ ప్రసాద్. మణిశర్మ, హ్యారిస్ జయరాజ్, యువన్‌శంకర్ రాజా వంటి సీనియర్ సంగీత దర్శకుల చరిష్మా తగ్గడంతో ప్రస్తుతం దేవిశ్రీ హవా సాగుతోంది. రెహ్మాన్ ఒక సినిమాకు మ్యూజిక్ అందించడానికి మూడు కోట్ల నుండి ఆరు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటే. హ్యారిస్ జయరాజ్ మూడు కోట్ల వరకు తీసుకుంటాడట. అయితే వీళ్ళీద్దరూ తెలుగు సినిమాల వైపు ఎక్కువ దృష్టి పెట్తరు. ఈ ఇద్దరూ చేసేవి దాదాపుగా భారీ బడ్జెట్ సినిమాలే

రెమ్యూనరేషన్ విషయంలో కుమ్మేస్తున్నాడు రాక్ స్టార్. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ చేయించుకోవాలంటే చెల్లించుకోవాల్సిన మొత్తం ఎంతో తెలుసా? దేవి ఓ సినిమా చేయడానికి తీసుకునే పారితోషికం ఒక్కో సినిమాకు 2.5 కోట్ల రూపాయలు. మరీ సన్నిహితులైతే ఓ పాతిక లక్షల వరకు డిస్కౌంట్‌ ఇస్తాడట. ఆ తర్వాత గాయకులకు, గీత రచయితలకు, రికార్డింగ్‌కు వేరేగా డబ్బులు చెల్లించాలి.

అంటే దేవి చేత పని చేయించుకోవాలంటే ఓ సినిమాకు సంగీత విభాగానికే మూడు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాలన్నమాట. ఒక్కో చిత్రానికి 3కోట్లకు తగ్గను అంటూ తన పారితోషికం గురించి నిర్మాతలకు చెబుతున్నాడట దేవీ. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.

Hike in Devi sri Prasad remuneration

ఇటీవల కాలంలో దేవిశ్రీ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. గబ్బర్ సింగ్ , జులాయి, మిర్చి, అత్తారింటికి దారేది, ఖైదీ నెం 150. సినిమాల హిట్లతో మంచి జోరు మీదున్న దేవిశ్రీ ప్రస్తుతం పలు స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించిన విషయం తెలిసిందే. వరుస హిట్లతో సంగీత దర్శకుడు తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు.

ప్రస్తుతం తెలుగు సంగీత దర్శకులు ఎవరు కూడా కోటి రూపాయల పారితోషికం తీసుకోవడం లేదు. అందరు కోటికి కిందే ఉన్నారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం తన మ్యూజిక్‌తో సినిమాను నిలబెట్టగలననే నమ్మకం ఉంది కాబట్టే దేవి అంత రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నాడు. అయినా నిర్మాతలు అతనితో పనిచేయడానికి వెనుకాడడం లేదు. కాస్త పెద్ద బడ్జెట్‌ సినిమా అంటే అందరికీ మొదట గుర్తొచ్చే సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాదే.

English summary
It is heard that DSP has hiked his remuneration. Earlier he used to charge more than Rs 2.5 Cr per movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu