»   » నవ్వండి: సినిమా స్టార్స్ వింత ఎక్స్ ప్రెషన్స్ (ఫోటోలు)

నవ్వండి: సినిమా స్టార్స్ వింత ఎక్స్ ప్రెషన్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎదుటి వారిని నవ్వించడానికి మనం అప్పుడప్పుడూ వింతగా ఎక్స్ ప్రెషన్స్ పెడుతుంటాం. అంతే కాకుండా....మనం కావాలని చేయకున్నా అప్పుడప్పుడూ ఫోటోగ్రాఫర్లకు మన వింత ఎక్స్‌ప్రెషన్స్ చిక్కుతుంటాయి. ఎప్పుడూ మీడియా కెమెరాల నిఘాలో ఉండే సినిమా స్టార్ల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

వివిధ కార్యక్రమాల్లో ఫోటోగ్రాఫర్లకు చిక్కిన పలువురు సినిమా స్టార్ల వింత ఎక్స్ ప్రెషన్స్ నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యరాయ్, షారుక్ ఖాన్, విద్యా బాలన్, కాజోల్, బిపాసా బసు, శిల్పా శెట్టి,కరీనా కపూర్, జెనీలియా, జయా బచ్చన్, హృతిక్ రోషన్ లాంటి వారు వింత ఎక్స్ ప్రెషన్స్‌తో ఫోటోగ్రాఫర్లకు చిక్కారు.

అందుకు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేసి....మీరూ ఓ నవ్వు నవ్వండి.

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్

అందాల తార ఐశ్వర్యరాయ్‌ని చూసారుగా, ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇచ్చిందో. తన జీవితంలో ఎన్నడూ చూడని ఏదో బ్రహ్మాండాన్ని చూసినట్లుంది.

బిపాసా బసు

బిపాసా బసు


బిపాసా బసు ఎక్స్ ప్రెషన్ కాస్త తేడాగా ఉంది కదూ. మీరు ఎలా అంటే అలా ఊహించుకుని నవ్వుకోండి.

శిల్పా శెట్టి

శిల్పా శెట్టి


ఎంతో అందంగా ఉండే శిల్పా శెట్టిని...ఈ ఎక్స్ ప్రెషన్లో చూస్తే మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతోంది?

కరీనా కపూర్

కరీనా కపూర్

వామ్మో...కరీనా కపూర్ ఎక్స్ ప్రెషన్ ఇంత భయ పెట్టే విధంగా ఉందేంటి?

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్


దూరం నుండి చూస్తే ఈ లుక్ సల్మాన్ ఖాన్ లుక్ మాదిరి ఉందని అంటున్నారు. ఏదో వింతను చూసి షారుక్ ఇలా నోరు వెల్లబెట్టినట్లున్నాడు.

కాజోల్..

కాజోల్..


హీరోయిన్ కాజోల్‌ను ఎవరేమన్నారో? ఏంటో? ఇలా కోపంగా ఫేసు పెట్టింది.

కరణ్ జోహార్

కరణ్ జోహార్


షారుక్ ఖాన్ గానీ ‘కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి రానని చెప్పారా ఏంటి? కరణ్ జోహార్ ఇలా ఏడుపు మొహం పెట్టారు?

జెనీలియా

జెనీలియా


వామ్మో ఆ చూపేంటి? మేమేం నిన్ను ఎత్తుకెళ్లడం లేదమ్మా. జస్ట్ ఫోటో తీసుకుంటున్నాం అంతే. దానికే ఇలా ఫేసు పెట్టాలా?

కాజోల్

కాజోల్

కాజోల్ అందాన్ని ఆరాధించే అభిమానులు ఈ ఎక్స్ ప్రెషన్ చూస్తే ఎలా ఫీలవుతారో ఏంటో?

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా....పద్దతిగా ఉండాల్సిన చోట ఇలా ముక్కుతో కుస్తీ పుతున్నావేంటి? కనీసం కర్చీఫ్ కూడా లేదా?

జయా బచ్చన్

జయా బచ్చన్


పాపం... ఎవరో జయా బచ్చన్ సహనాన్ని పరీక్షించినట్లు ఉన్నారు. సహనం నశించిన తర్వాత ఇలా కోపంగా ఫేసు పెట్టినట్లుంది.

హృతిక్ రోషన్

హృతిక్ రోషన్


హృతిక్ రోషన్ చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. ఎవరిపైనో రివేంజ్ తీర్చుకోవాలనే కసితో ఉన్నట్టున్నాడు. ఇంతకీ హృతిక్ కోపం ఎవరిపైనో?

విద్యా బాలన్

విద్యా బాలన్


ఇలాంటి విషయాల్లో విద్యాబాలన్ ముందు ఉంటుంది. కావాలనే ప్రేక్షకులను నవ్వించడానికి ఓ కార్యక్రమంలో ఇలా వింత ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది.

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్


బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇలా వింతగా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టాడు.

పరిణీతి చోప్రా

పరిణీతి చోప్రా


వామ్మో....చీకట్లో నిన్ను ఇలా ఎవరైనా చూస్తే నిజమైన దెయ్యం అనుకుని దడుచుకుంటారు తల్లో...!

English summary

 Our Bollywood celebrities are rarely caught off guard, they are usually dressed in the best of outfits and have the right expression 24x7. But come on... No person in this world can be poised all the time, even our Bollywood celebrities.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu