»   » అక్రమ సంబంధమే?:స్టార్ మ్యూజిక్ డైరక్టర్ విడాకులకు అప్లై, 22 సంవత్సరాల కాపురం కూలింది

అక్రమ సంబంధమే?:స్టార్ మ్యూజిక్ డైరక్టర్ విడాకులకు అప్లై, 22 సంవత్సరాల కాపురం కూలింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: వరసపెట్టి సెలబ్రెటీల డైవర్స్, బ్రేకప్ లు ఈ సంవత్సరం వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు చెప్పబోయే విడాకుల వ్యవహారం ఎవరూ ఊహించనది. అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా, ఫర్హాన్ ,అధునా అక్తర్ ల తర్వాత ఇప్పుడు బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరక్టర్ హిమ్మేష్ రేష్మియా విడాకుల వ్యవహారం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

గాయకుడు నుంచి, సంగీత దర్శకుడుగా మారిన హిమ్మేష్ రేష్మియా ఆయన భార్య కోమల్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు ఎక్కారు. వీళ్లిద్దరూ ఇరవై రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుని ముంబై బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ అప్లై చేసారు.

వాస్తవానికి హిమ్మేష్ రేష్మియా ఫ్యామిలీ లైఫ్ గురించి ఎప్పుడూ , ఎలాంటి వివాదాలు రాలేదు. అలాగే హిమ్మేష్ పర్శనల్ లైప్ మీద కూడా మీడియాలో గాసిప్ లు లేవు. అలాంటిది హఠాత్తుగా ఆయన తన భార్యతో విడిపోతూ కోర్టుకు వెళ్లటం బాలీవుడ్ లో షాక్ ఇచ్చింది. అందుకు కారణాలు ఏమిటనే విషయమై అందరూ ఆలోచనలో పడ్డారు.

ఇల్లీగల్ కాంటాక్ట్

ఇల్లీగల్ కాంటాక్ట్

అయితే వీరి విడాకులకు కారణం ..అక్రమ సంభందం అంటూ మిడ్ డే పత్రిక రాసుకొచ్చింది. కోమల్ తన భార్య హిమ్మేష్ నుంచి విడివడి గత కొద్ది నెలలుగా వేరుగా ఉంటున్నారు. లీగల్ విడిపోవాలని నిర్ణయించుకోవటానికి కారణం ..అలాంటి కారణమే ఉందని, ఇల్లీగల్ కాంటాక్ట్ అన్యోనంగా ఉండే ఈ జంట విడిపోవటానికి కారణమైందని రాసుకొచ్చింది.

హిమ్మేష్ రేష్మియా ఏమంటాడంటే

హిమ్మేష్ రేష్మియా ఏమంటాడంటే

లోకల్ మీడియాతో హిమ్మేష్ మాట్లాడుతూ... తాము విడిపోవాలని నిర్ణయించుకోవటం నిజమే అన్నారు. కొన్ని సార్లు జీవితంలో ఒకరినొకరు రెస్పెప్ట్ చాలా అవసరం అవుతుంది. మేమిద్దరం మా బంధానికి గౌరవం ఇస్తూ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. నేను కోమలి కూడా ఇదే నిర్ణయంతో ఉన్నాం అందుకే విడాకులకు అప్లై చేస్తున్నాం అన్నారు.

కొడుకు ఉన్నారు

కొడుకు ఉన్నారు

హిమ్మేష్ మరింతగా ఈ విషయం గురించి చెప్తూ..కేవలం మేము మాత్రమే కాకుండా మా కుటుబంలో అందరూ కలిసే తీసుకున్న నిర్ణయం ఇది. మేము విడిపోయినా కోమల్ మా కుటుంబ సబ్యురాలే. కొన్ని తప్పనిసరి నిర్ణియాలు తీసుకున్నప్పుడు కొన్ని సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.అందుకు నేను సిద్దంగానే ఉన్నాను అన్నారు.

హిమ్మేష్ భార్య ఏమంటోందంటే

హిమ్మేష్ భార్య ఏమంటోందంటే

హిమ్మేష్ రేష్మియా బార్య ఈ విషయమై మాట్లాడుతూ... హిమ్మేష్, నేను పూర్తిగా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటాము. ఇద్దరం కలిసే ఆలోచించి, చర్చించుకుని విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాం. మ్యూచవల్ రెస్పెక్ట్ అనేది చాలా అవసరం. విడిపోయినా నేను వారి కుటుంబ సబ్యురాలినే. అలాగే హిమ్మేష్ కూడా మా కుటుంబ సభ్యుడే అన్నారామె.

కారణం ఏమిటి..

కారణం ఏమిటి..

హిమ్మేష్ రేష్మియా ప్రస్తుతం సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ లులియాతో కలిసి ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నారు. ఈ ఆల్బమ్ ని అమితాబ్ బచ్చన్ లాంచ్ చేసారు. ఆప్ కు మౌషికి అనే పేరుతో ఈ ఆల్బమ్ రాబోతోంది. ఇందులో సాంగ్ ని లిలియా పాడింది. ఆమె వాయిస్ అద్బుతమని రేష్మియా పొగిడారు. రెండు గంటల్లో పాట రికార్డింగ్ అయ్యిపోయింది అంటూ మెచ్చుకున్నాడు. అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ...హిమ్మేష్ ...కాపురం విడిపోవటానికి కారణం ఏమిటనేది మాత్రం తెలియరాలేదు.

English summary
It's Himesh Reshammiya, who has filed for divorce! Singer turned actor Himesh Reshammiya and his wife Komal, who were married for about twenty two years, have decided to call it quits and have filed for divorce at a Bandra family court.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu