»   » ‘లయన్’ ఆడియో వేడకకు హాజరైందని.. త్రిషకు వార్నింగ్

‘లయన్’ ఆడియో వేడకకు హాజరైందని.. త్రిషకు వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య నటించిన ‘లయన్' ఆడియో వేడుక ఇటీవల హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర హీరోయిన్ త్రిష కూడా ఈ ఆడియో వేడుకకు వచ్చి సందడి చేసారు. అయితే త్రిష ఈ వేడుకకు హాజరు కావడంపై తమిళ సంఘాలు ఆగ్రహంగా ఉన్నారు.

తమిళ సంఘాలు త్రిషపై ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొనడమే. ఇటీవల శేషాచలం ఎన్‌కౌంటర్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లను ఏపీ పోలీసులు మట్టుపెట్టారు. వీరంతా తమిళులు కావడంతో తమిళ సంఘాలు చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నాయి.

ఈ ఘటనపై ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వారిని చంపిన చంద్రబాబుతో కలిసి త్రిష కార్యక్రమంలో పాల్గొనడమేమిటంటూ హిందూ మక్కల్‌ కట్చి ప్రశ్నిస్తోంది. త్రిష తీవ్రపరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హిందూ మక్కల్‌ కట్చి నేత వీరమాణిక్యం హెచ్చరించారు.

 Hindu makkal katchi warns Trisha

ఈ ఎఫెక్టు ఇపుడు 'S/O సత్యమూర్తి' సినిమాపై పడింది. ఈ సినిమాకు, ఆ ఎన్ కౌంటర్ కు సంబంధం లేక పోయినా కొన్ని తమిళ సంఘాలు...తెలుగు సినిమాలపై తమ ప్రతాపం చూపిస్తున్నాయి. ఈ ఎన్ కౌంటర్ కి నిరసనగా తెలుగు హీరో సినిమాను తమిళనాడులో ప్రదర్శించనివ్వమని తమిళగ వళియురుమై కచ్చి, నామ్ తమిళర్ కచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంచీపురంలో ఈ చిత్రం స్ర్కీనింగ్ అవుతున్న థియేటర్ పై దాడి చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. దాంతో 'సన్నాఫ్ సత్యమూర్తి' స్ర్కీనింగ్ ఆగింది.

తమిళ సంఘాలు చేస్తున్న ఓవరాక్షన్ పై తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రెండు రాష్ట్రాల సినీ ఇండస్ట్రీ పెద్దలు కలుగజేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురాక పోతే....భవిష్యత్తులో తమిళ సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో అడ్డుకునే పరిస్థితి రావచ్చని విశ్లేషకులు అంటున్నారు.

English summary
Hindu makkal katchi warns Actress Trisha.
Please Wait while comments are loading...