twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిక్కుల్లో రూ. 1000 కోట్ల బడ్జెట్ ‘మహాభారతం’ మూవీ!

    ఈ సినిమాకు ‘మహా భారతం’ అని పేరు పెట్టడానికి వీల్లేదంటూ.... కేరళకు చెందిన హిందూ ఐక్యవేదిక హెచ్చరించింది. రాండామూజమ్ నవల ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నప్పుడు...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: భారతీయుల చారిత్రక చరిత్ర మహాభారతాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా రూ. 1000 కోట్లతో మహాభారతాన్ని సినిమాగా తీయబోతున్నట్లు యూఏఈకి చెందిన ఎన్నారై పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టి ప్రకటించిన సంగతి తెలిసిందే.

    ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ రాసిన రాండామూజమ్ నవల ఆధారంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మహాభారతంలో భీముని పాత్ర కోణంలో, పాండవుల కథ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మళలయాల నటుడు మోహన్ లాల్ ఇందులో ప్రధానమైన భీముడి పాత్రలో కనిపించబోతున్నారు.

    అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందే చిక్కుల్లో పడింది.

    ఆ పేరు పెడితే ఊరుకోం

    ఆ పేరు పెడితే ఊరుకోం

    ఈ సినిమాకు ‘మహా భారతం' అని పేరు పెట్టడానికి వీల్లేదంటూ.... కేరళకు చెందిన హిందూ ఐక్యవేదిక హెచ్చరించింది. రాండామూజమ్ నవల ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నప్పుడు... ఈ చిత్రానికి అదే పేరు పెట్టాలని సంఘం అధ్యక్షురాలు కేపీ శశికళ డిమాండ్ చేశారు.

    సినిమాను అడ్డుకుంటాం

    సినిమాను అడ్డుకుంటాం

    ఒక వేళ ఈ సినిమాకు మహాభరతం అనే పేరునే పెడితే షూటింగును అడ్డుకుంటామని, థియేటర్లలో ఆడబోనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. ఎంటీ వాసుదేవన్ నాయర్ ‘రాండామాజమ్' నవల రాసారని... ఆ నవలలో ఉన్నది సినిమాగా తీస్తే వేద వ్యాసుడు రాసిన మహాభారతం పేరు ఎలా పెడతారని మండి పడ్డారు.

    సినిమా ఎప్పుడు వస్తుంది?

    సినిమా ఎప్పుడు వస్తుంది?

    మహాభారతాన్ని రెండు భాగాలుగా తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగాన్ని 2020లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిను మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఆంగ్ల భాషల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    షూటింగ్ ఎప్పుడు?

    షూటింగ్ ఎప్పుడు?

    2018 సెప్టెంబర్లో ఈ సినిమా సెట్ష్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్, విఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు.

    English summary
    'Change the name': Hindutva leader issues warning to Mohanlal's Mahabharata. It seems Mohanlal starrer The Mahabharata now faces the ire of the Hindu Aikya Vedi. The outfit's leader KP Sasikala has warned the makers to drop the name. 'Let me put it in a very simple way. If the film is titled The Mahabharata, it will not reach the theatres'. The film narrates the epic through the eyes of Bhima, the second of the Pandavas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X