twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కీలక ఘట్టం: నేడు బోనెక్కనున్న సల్మాన్‌

    By Srikanya
    |

    ముంబయి: కారు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమై, నలుగురిని గాయ పరిచారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌.. కోర్టులో శుక్రవారం తన వాదనలు వినిపించనున్నారు. 2004లో జరిగిన ఆ ఘటనకు సంబంధించి తన వాదన వినిపించడానికి ఖాన్‌కు ఇదొక కీలకమైన అవకాశం.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    మొత్తం 25 మంది సాక్షులను విచారించిన అనంతరం.. సీఆర్‌పీసీలోని 313 సెక్షన్‌ ప్రకారం.. చివరిగా ఖాన్‌ తన వాదనలు వినిపించడానికి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి డి.డబ్లూ.దేశ్‌పాండే సమన్లు జారీ చేశారు.

    ఈ నిబంధన ప్రకారం.. ప్రాసిక్యూషన్‌ ప్రవేశపెట్టిన సాక్ష్యాలపై తన వాదన వినిపించే అవకాశం నిందితుడికి దక్కుతుందని, దీనితోపాటు విచారణ సమయంలో ఏదైనా సందిగ్ధత ఉంటే కోర్టు అతణ్ని ప్రశ్నిస్తుందని ప్రభుత్వ ప్రత్యేక విచారణ కర్త (ప్రాసిక్యూటర్‌) ప్రదీప్‌ ఘారాట్‌ తెలిపారు. సల్మాన్‌ వాదన రికార్డు చేసిన అనంతరం.. కావాలంటే సాక్షులను విచారించే అవకాశం అతడికి కోర్టు కల్పిస్తుందని.. చివరగా తీర్పు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

    Hit and Run case: Salman Khan to put up his defense today

    సల్మాన్‌ఖాన్ వాంగ్మూలంతో కేసు విచారణ పూర్తవుతుంది. అనంతరం కోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నేరం రుజువైతే సల్మాన్‌ఖాన్‌కు ఎలాంటి శిక్షపడుతుందన్న దానిపై చర్చలు జోరందుకున్నాయి.

    కేసు వివరాల్లోకి వెళితే...

    2002 సెప్టెంబర్ 28న అర్ధరాత్రి ముంబైలో ఓ హోటల్ నుంచి సల్మాన్ కారులో వస్తుండగా రోడ్డుపై నిద్రిస్తున్నవారిపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. కేసును విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు.. ఇప్పటివరకు 25 మంది నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. చివరిగా సల్మాన్‌ఖాన్ స్టేట్‌మెంట్‌ను శుక్రవారం రికార్డు చేయనుంది.

    తాను కృష్ణజింకల వేట కేసులో జోధ్‌పూర్ కోర్టుకు హాజరవ్వాల్సి ఉన్నందున స్టేట్‌మెంట్ రికార్డును వాయిదా వేయాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ఖాన్ శుక్రవారం ముంబై స్థానిక కోర్టు హాజరై.. వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. నేరం రుజువైతే సల్మాన్‌ఖాన్‌కు పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

    English summary
    Bollywood actor Salman Khan, will appear before the Judge today to give his version about the mishap that occurred in the wee hours of September 28, 2002. Earlier, Judge D W Deshpande has summoned Salman Khan to appear on 27th March 2015 to give his statement under section 313 of CrPc after the prosecution closed its evidence by examining more than 25 witnesses in court.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X