For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాలీవుడ్ హిట్లు-ప్లాపులు 2011

By Bojja Kumar
|

టాలీవుడ్ లో 2011 సంవత్సరంలో దాదాపు 80 తెలుగు సినిమాలు రూపొందించబడ్డాయి. చెప్పుకోవడానికి ఈ సంఖ్య పెద్దగా ఉన్నా, అందులో విజయం సాధించినవి మాత్రం వేళ్లపై లెక్క పెట్టొచ్చు. చాలా సినిమాలు నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఈ సంవత్సరం ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో తెలుగు సినిమా కలెక్షన్ల మోత మోగించిందని చెప్పవచ్చు. ప్రథమార్థం అంతా మిరపకాయ్‌, అలా మెుదలైంది, అహనా పెళ్లంట, 100% లవ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, వీర వంటి చిత్రాలు సేఫ్‌జోన్‌లో నిలబడగా ద్వితీయార్థంలో విడుదలైన 'దూకుడు' బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా టాప్‌ గ్రాసర్‌ చిత్రంగా నిలిచి శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది. 5 సంవత్సరాలుగా హిట్స్‌తో దోబూచులాడిన మహేష్‌బాబుకు ఇండస్ట్రీ టాప్‌ గ్రాసర్‌ చిత్రాలలో ఒకటిగా 'దూకుడు' చిత్రం నిలిచి పోయింది.

జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రథమార్థంలో వచ్చిన 'శక్తి' అపజయం మిగల్చగా ద్వితీయార్థంలో వచ్చిన 'ఊసరవెల్లి' కలెక్షన్ల పరంగా ఊరటనిచ్చింది. బాలకృష్ణకు ప్రథమార్థంలో 'పరమవీరచక్ర' చేదు అనుభవాన్ని మిగిలిస్తే ద్వితీయార్థం వచ్చిన 'శ్రీరామరాజ్యం' చిత్రం కొత్త ఊపునిచ్చింది. అల్లు అర్జున్‌ నటించిన బధ్రీనాధ్‌ ఈ సంవత్సరం అంచనాలను అందుకోలేకపోయింది. ఓవరాల్‌గా యావరేజ్‌గా నిలిచింది. రవితేజకు మిరపకాయ్‌ హిట్‌గా నిలిస్తే 'వీర' సినిమా యావరేజ్‌గా పోయింది.

నాగార్జునకు గగనం సినిమా ఎబో యావరేజ్ సినిమా నిలిచింది. రగడ్ సినిమా యావరేజ్ గా నిలిచింది. తాజాగా విడుదలైన రాజన్న ఫర్వాలేదనే టాక్ తో ముందుకు సాగుతోంది. రాజన్న సినిమా పూర్తి ఫలితం తేలాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్, పంజా చిత్రాలు యావరేజ్ చిత్రాలు పేరు తెచ్చుకున్నాయి. నాగ చైతన్యకు 100%లవ్ హిట్టిస్తే...దడ, బెజవాడ సినిమాలు ప్లాపుగా నిలిచాయి.

వరుణ్‌సందేశ్‌ నటించిన కుదిరితే ఓ కప్పు కాఫీ, బ్రహ్మిగాడి కథ, ప్రియుడు చిత్రాలు మూడు బిలో యావరేజ్‌గా పేరు తెచ్చుకున్నాయి. నానీ నటించిన అలా మొదలైంది సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. పిల్ల జమిందార్‌ ఎబోవ్‌ యావరేజ్‌ హిట్‌గా నిలిచింది. సెగ ఫ్లాపయ్యింది. సునీల్‌ నటించిన కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం అప్పల్రాజు దొంగలబండి చిత్రాలు ఫ్లాపయ్యాయి. కృష్ణుడు నటించిన వైకుంఠపాళి, నాకు ఓ లవరు ఉంది చిత్రాలు రెండూ ఫ్లాపయ్యాయి. నిఖిల్‌ నటించిన వీడు తేడా 4వారాలు దాటి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

అల్లరి నరేష్‌ ఎప్పటిలానే తన హవా నిలబెట్టుకున్నాడు. అహనాపెళ్లంట, సీమటపాకాయ్‌ చిత్రాలు హిట్‌ చిత్రాలుగా వసూళ్ల పంట పండిస్తే మడతకాజా, సంఘర్షణ డబ్బింగ్‌ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ఇక హీరో రామ్‌ నటించిన కందిరీగ హిట్టయి కలెక్షన్లు కురిపించింది. సుమంత్‌కి గోల్కొండ హైస్కూల్‌ యావరేజ్‌గా టాక్‌ తెచ్చుకుంటే దగ్గరగా-దూరంగా, రాజ్ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. విష్ణు నటించిన 'వస్తాడు నా రాజు' ఫ్లాప్‌ అయ్యింది. జగపతిబాబు నటించిన చట్టం, నగరం నిద్రపోతున్న వేళ చిత్రాలు రెండూ అపజయం పాలయ్యాయి. శ్రీకాంత్‌కు శ్రీరామరాజ్యం హిట్టు దక్కినా అది బాలకృష్ణ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక విరోధి, దుశ్శాసన చిత్రాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. రానా నటించిన నేను నా రాక్షసి ఫ్లాపయింది. గోపీచంద్‌ నటించిన వాంటెడ్, మొగుడు చిత్రాలు రెండూ పరాజయం పాలయ్యాయి. సిద్దార్థ నటించిన అనగనగా ఓ ధీరుడు, 180 చిత్రాలు ఫ్లాపవ్వగా ఓ మై ఫ్రెండ్‌ యావరేజ్‌గా నిలిచింది. నారా రోహిత్‌ నటించిన 'సోలో' ఎబోవ్‌ యావరేజ్‌ చిత్రంగా పేరుతెచ్చుకుంది.

English summary
Its time to bid good bye to 2011 and welcome 2012. But before doing this one has to analyse all the things done in 2011 so as to ensure that the same mistakes are not repeated again. Same thing will be applicable to Telugu movies in 2011. Many movies got released in 2011 of which only some could impress the audience. But to be frank, 2011 was mostly dominated by dubbed movies than direct movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more