»   » శ్రీదేవి అంటే అదీ.. ఆస్కార్ వేదికపై కూడా, ఆ ఇద్దరు నటులు ఆస్కార్ వేదికపై!

శ్రీదేవి అంటే అదీ.. ఆస్కార్ వేదికపై కూడా, ఆ ఇద్దరు నటులు ఆస్కార్ వేదికపై!

Subscribe to Filmibeat Telugu

ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం నేడు లాస్ ఏంజెల్స్ నగరంలో ముగిసింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి మొదలు విభాగాల్లో ఆస్కార్ అవార్డులని 90 వ అకాడమీ అవార్డుల వేదికపై ప్రధానం చేసారు. కాగా ఈ వేదికపై ఈ ఏడాది మరణించిన నటులకు సంతాపం తెలియజేసారు. ఈ ఏడాది మరణించిన నటుల్ని గుర్తుచేసుకోవడానికి మెమోరియమ్ సెక్షన్ ని ఏర్పాటు చేయడం విశేషం. ఆస్కార్ వేదికపై ఈ కార్యక్రమంలో ఇటీవల మరణించిన భారత నటులు శ్రీదేవి, శశి కపూర్ ల స్మరణ కూడా జరిగింది.

 కన్నుల పండుగగా ఆస్కార్ 2018 అవార్డ్స్

కన్నుల పండుగగా ఆస్కార్ 2018 అవార్డ్స్

కన్నుల పండుగని తలపించేలా నేడు లాస్ ఏంజెల్స్ నగరంలో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ముగిసింది.

 మరణించిన వారి స్మరణ

మరణించిన వారి స్మరణ

ఈ వేడుకలో ఈ ఏడాది మరణించిన నటుల స్మరణ జరిగింది. మరణించిన నటులకు మోమెరియం సెక్షన్ లో సంతాపం తెలియజేసారు.

 శ్రీదేవి ఆకస్మిక మరణం

శ్రీదేవి ఆకస్మిక మరణం

శ్రీదేవి ఆకస్మిక మరణం యావత్ భారతాన్ని కలచివేసిన సంగతి తెలిసిందే. అప్పటివరకు చలాకీగా తిరిగిన శ్రీదేవి ఒక్కసారిగా అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

 శ్రీదేవి అంటే అదీ

శ్రీదేవి అంటే అదీ

బాల నటిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన శ్రీదేవి అసామాన్యమైన ప్రతిభని కనబరిచి నటిగా తన ఖ్యాతిని నలువైపులా వ్యాపింపజేసింది. శ్రీదేవి మరణానికి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో సంతాపం తెలియజేశారంటే ఆమె స్థాయిని అర్థం చేసుకోవచ్చు.

 శశి కపూర్ కూడా

శశి కపూర్ కూడా

గత ఏడాది మరణించిన దిగ్గజ నటుడు శశి కపూర్ ని కూడా ఆస్కార్ వేదికపై స్మరించుకున్నారు.

హాలీవుడ్ లో కూడా

హాలీవుడ్ లో కూడా

శశి కపూర్ బాలీవుడ్ చిత్రాలలో సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆయన పలు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ది హౌస్ హోల్డర్, బాంబే టాకీస్, ఇన్ కస్టడీ వంటి అంతర్జాతీయ చిత్రాల్లో శశి కపూర్ నటించారు.

English summary
Hollywood Pays Tribute to Sridevi and Shashi Kapoor. Sridevi, Shashi Kapoor remembered at in Memoriam section at Oscars 2018
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu