»   » వరుణ్‌ని హ్యాండిల్ చేయాలంటే వాళ్ళు రావాల్సిందే, జీరో గ్రావిటీలో అద్భుతాలు!

వరుణ్‌ని హ్యాండిల్ చేయాలంటే వాళ్ళు రావాల్సిందే, జీరో గ్రావిటీలో అద్భుతాలు!

Subscribe to Filmibeat Telugu

రెండు వరుస సూపర్ హిట్లతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి జోష్ మీద ఉన్నాడు. వరుణ్ తేజ్ నటించిన ఫిదా, తొలిప్రేమ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ఆ చిత్రాలు అందించిన ఉత్సాహంతో వరుణ్ కొత్త చిత్రానికి రెడీ అవుతన్నాడు. అది కూడా అలాంటి ఇలాంటి చిత్రం కాదు. అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో స్పేస్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందబోతోంది. ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి చిత్రం రూపొందుతుండడం ఇదే తొలిసారి అని కూడా అంటున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ఒక్కో అంశం ఆసక్తిని రేపుతూ ఇప్పటి నుంచే అంచనాలు పెంచుతోంది.

అందరూ గ‌ర్వ‌ప‌డే సినిమా తొలిప్రేమ
 ఆరంభంలో తడబాటు

ఆరంభంలో తడబాటు

వరుణ్ తేజ్ కెరీర్ ఆరంభంలో విజయాలు దక్కక తడబడ్డాడు. కంచె చిత్రం హిట్ కాకున్నా వరుణ్ లోని నటుడిని ఆ చిత్రం బయటకు తీసింది.

 రెండు సూపర్ హిట్స్ తో ట్రాక్ లోకి

రెండు సూపర్ హిట్స్ తో ట్రాక్ లోకి

కెరీర్ ఆరంభంలో తడబడిన వరుణ్ తేజ్ ఇప్పుడు వరుస రెండు హిట్స్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఫిదా, తొలిప్రేమ చిత్రాలు రొమాంటిక్ హిట్స్ గా నిలవడంతో వరుణ్ కు యూత్ లో ఫాలోయింగ్ పెరిగింది.

అనుహ్య నిర్ణయం

అనుహ్య నిర్ణయం

రొమాంటిక్ చిత్రాలతో వరుస హిట్లు కొడుతున్న తరుణంలో వరుణ్ తేజ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడనే చెప్పొచ్చు. ప్రయోగాత్మక చిత్రంగా రాబోతున్న స్పేస్ థ్రిల్లర్ మూవీలో వరుణ్ నటించబోతున్నాడు.

 ఘాజి మ్యాజిక్ రిపీట్ అవుతుందా

ఘాజి మ్యాజిక్ రిపీట్ అవుతుందా

ఘాజి చిత్రంతో దర్శకుడిగా మారిన సంకల్ప్ రెడ్డి ఆ చిత్రానికి చిత్ర ప్రముఖులనుంచి ప్రశంసలు అందుకున్నాడు. అండర్ మిషన్ గా, షబ్ మెరైన్ యుద్ధం నేపథ్యంలో వచ్చిన ఘాజి చిత్రం ఆడియన్స్ మెస్మరైజ్ చేసింది. అదే తరహాలో సంకల్ప్ రెడ్డి మరో ప్రయోగం చేయబోతున్నాడు.

 హాలీవుడ్ నుంచి దించుతున్నారు

హాలీవుడ్ నుంచి దించుతున్నారు

ఈ చిత్రానికి సంబందించిన సన్నివేశాలు జీరో గ్రావిటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. స్పేస్ రీసెర్చ్ నేపథ్యంలో ఇంతవరకు ఇండియాలో సినిమా రాలేదు. ఈ తరహా చిత్రాలు తీయడంలో అనుభవం ఉన్న హాలీవుడ్ వారిని రంగంలోకి దించుతున్నారు.

జీరో గ్రావిటీలో స్టంట్స్

జీరో గ్రావిటీలో స్టంట్స్

వరుణ్ తేజ్ ఈ చిత్రంలో జీరో గ్రావిటీలో కొన్ని స్టంట్స్ చేయవలసి ఉంటుంది. ఆ సన్నివేశాలని హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్ నేపథ్యంలో రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

సరికొత్తగా వరుణ్ తేజ్

సరికొత్తగా వరుణ్ తేజ్

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే కొత్త మేకోవర్ పై వరుణ్ తేజ్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Hollywood stuntmen for Varun Tej’s space film. Sankalp Reddy is directing this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu