»   » దర్శకుడు తేజ కొత్త చిత్రం ‘హోరా హోరీ’ వివరాలు

దర్శకుడు తేజ కొత్త చిత్రం ‘హోరా హోరీ’ వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అలా మొదలైంది', 'అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్. 'చిత్రం, 'నువ్వు నేను', జయం' అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన దర్శకుడు తేజ. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'హోరా హోరీ'.

నూతన, నటీ నటులతో ప్రేమ కధా చిత్రాలను రూపొందించి, విజయం వైపు అవి ప్రయాణించేలా చేయటం దర్శకుడు 'తేజ' స్టయిల్. ఈ చిత్రాన్నికూడా ఆయన నూతననటీ నటులతోనే తెరకెక్కించారు. ప్రేమ కథాచిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంత కార్యక్రమాలను జరుపుకుంటోంది.

Hora Hori release the audio July 29

ప్రేమ కథా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ కోడూరి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జూలై 29న హైదరాబాద్ లోని సైబర్ కెన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.

కొత్త నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కోడూరి కళ్యాణ్, పాటలు: పెద్దాడ మూర్తి, రచనా సహకారం: ఆకెళ్ళ శివప్రసాద్, బాలకుమారన్, కెమెరా: దీపక్ భగవంత్, ఎడిటర్: జునైద్, కాస్ట్యూమ్ డిజైనర్; శ్రీ, స్టంట్స్: పాంథర్ నాగరాజు, నృత్యాలు: శంకర్, కెవిన్, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి. వి, నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్, కధ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: తేజ.

English summary
According to the latest information, Hora Hori has completed shooting part and its ... to release the audio July 29.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu