»   » రక్తపాతం సృష్టిస్తున్న హీరోయిన్లు! (ఫోటో ఫీచర్)

రక్తపాతం సృష్టిస్తున్న హీరోయిన్లు! (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రేక్షకులను మత్తెక్కించే సెక్సీ ఒంపు సొంపులు కలిగిన కత్తిలాంటి హీరోయిన్లు వారు. తమకు అందం, అభినయం, డాన్సులతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే కాదు....కత్తి పట్టి హీరోలతో సమానంగా సాహసాలు కూడా చేస్తాం, విలన్లను తెగనరుకుతాం అని నిరూపిస్తున్నారు.

సూపర్ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన హీరోయిన్ అనుష్క సెక్సీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే 'అరుంధతి' చిత్రంలో కత్తి పట్టి అందరినీ భయపెట్టింది. అరుంధతి చిత్రం ఆమె కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలవడంతో అనుష్కను స్టార్ హీరోయిన్‌ను చేసింది.

ఇక అప్పటి వరకు గ్లామరస్ హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించిన ప్రియమణి 'క్షేత్రం' చిత్రంలో కత్తి పట్టి రక్తం చిందించింది. అదే విధంగా 'చంద్ర' చిత్రంలో సెక్సీ హీరోయిన్ శ్రీయ కత్తి పోరాటాలు చేసింది. మగధరీ సినమాలో హీరోయిన్ కాజల్ విల్లు పట్టి విన్యాసాలు చేయగా, ఉరిమి చిత్రంలో జెనీలియా కత్తి ఫైటింగుల్లో శబాష్ అనిపించుకుంది. ఇక హీరోయిన్ అమలా పాల్ 'ఇద్దరమ్మాయిలతో' సినిమా కోసం నింజా ఫైట్ నేర్చుకుంది.

ఈ తారామణుల సాహసకృత్యాల చిత్రమాలికను స్లైడ్ షోలో వీక్షించండి.

అనుష్క

అనుష్క

అప్పటి వరకు గ్లామర్ తో ఆకట్టుకున్న అనుష్క అరుంధతితో తనలోని విశ్వరూపాన్ని చూపించింది

రుద్రమదేవి

రుద్రమదేవి

ఇప్పుడు రుద్రమదేవి చిత్రంలోనూ అనుష్క మరోసారి కత్తి పట్టనుంది.

వర్ణ

వర్ణ


‘వర్ణ' చిత్రంలో అనుష్క కత్తిపట్టి విన్యాసాలు చేసే ఆటవిక యువతిగా ఆకట్టుకుంది. కత్తి పట్టి యాక్షన్ సీన్లు ఇరగదీసింది.

జెనీలియా

జెనీలియా

ఉరిమి చిత్రంలో జెనీలియా సాహసాలు చేసి ఆకట్టుకుంది. అప్పటి వరకు చిలిపి పనులు చేస్తూ బబ్లీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఆమె ఉరిమి చిత్రంలో రక్తపాతం సృష్టించి అందరినీ షాక్ కు గురి చేసింది.

జెనీలియా కెరీర్లో డిఫరెంటు చిత్రం

జెనీలియా కెరీర్లో డిఫరెంటు చిత్రం


లవ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న జెనీలియా‌కు ‘ఉరిమి' చిత్రం ఒక డిఫరెంట్ చిత్రం అని చెప్పొచ్చు.

విలు విద్యలోనూ...

విలు విద్యలోనూ...

ఉరిమి చిత్రంలో కేవలం కత్తి యుద్ధాలు మాత్రమే కాకుండా....విలు విద్య కూడా ప్రదర్శించింది జెనీలియా.

ప్రియమణి

ప్రియమణి


క్షేత్రం చిత్రంలో ప్రియమణి కత్తి పట్టించి రక్తపాతం సృష్టించింది. ఈ చిత్రంలో ఆమెకు పెర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు పడ్డాయి.

ప్రియమణి చండీ

ప్రియమణి చండీ


చండీ చిత్రంలో విల్లు ఎక్కుపెట్టిన ప్రియమణి

చురకత్తుల్లాంటి చూపులు

చురకత్తుల్లాంటి చూపులు

సినిమాల్లో చురకత్తుల్లాంటి చూపులతో యువ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రియమణి....కత్తి పడితే తన తడాకా ఎలా ఉంటుందో చండీ చిత్రంలో చూపెట్టింది.

కాజల్

కాజల్


మగధీర్ చిత్రంలో కాజల్ అగర్వాల్ కర్తపాతం సృష్టించక పోయినా విలు విద్య ప్రదర్శించి ఆకట్టుకుంది.

శ్రీయ

శ్రీయ

చంద్ర అనే కన్నడ సినిమాలో హీరోయిన్ శ్రీయ కత్తి పట్టిన దృశ్యం.

అమలా పాల్

అమలా పాల్

హీరోయిన్ అమలా పాల్ ‘ఇద్దరమ్మాయిలతో' సినిమా కోసం నింజా ఫైట్ నేర్చుకుంది.

English summary

 Telugu actresses Anushka, Priyamani, Genelia, Kajal, Shriya doing action oriented movies like Arundhati, Rudrama devi, Urimi, Chandi, Chandra.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu