»   » బిగ్ బాస్ వైల్డ్‌కార్ట్ ఎంట్రీపై అనసూయ క్లారిటీ, ఇది పొగరు కాదు బాసూ...

బిగ్ బాస్ వైల్డ్‌కార్ట్ ఎంట్రీపై అనసూయ క్లారిటీ, ఇది పొగరు కాదు బాసూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాల్టీ షో 'బిగ్ బాస్'. మొదలైన నాటి నుండే ఈ షో ఊహించని మలుపులు, గొడవలు, వివాదాలతో సంచలనంగా దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో 14 మంది పోటీ దారులు ఉన్నారు. అయితే ఇంత మంది ఉన్నా అసలైన సెలబ్రిటీలు షోలో లేరనే అసంతృప్తి ప్రేక్షకుల్లో ఉంది.

ఈ నేపథ్యంలో త్వరలో 'బిగ్ బాస్' ఇంట్లోకి అనసూయ లేదా మంచు లక్ష్మి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అనసూయ పేరు తెరపైకి రాగానే షో మరింత రసవత్తరంగా సాగుతుందనే ఒక ఆసక్తి బిగ్ బాస్ ప్రేక్షకుల్లో నెలకొంది. తన ఎంట్రీ గురించి వస్తున్న ప్రచారంపై అనసూయ స్పందించారు.

అనసూయ చికాకు పడిందా?

అనసూయ చికాకు పడిందా?

తనపై వస్తున్న వార్తలకు అనసూయ చికాకు పడిందో ఏమో? తెలియదు కానీ Umm.. అని నిట్టూరుస్తూ బిగ్ బాస్ షోలో తన ఎంట్రీ, మంచు లక్ష్మి ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది హాట్ యాంకర్ అనసూయ.

మంచు లక్ష్మి గురించి తెలియదు

మంచు లక్ష్మి గురించి తెలియదు

బిగ్ బాస్ ఇంట్లోకి మంచు లక్ష్మి గారు ఎంట్రీ ఇస్తారో? లేదో తనకు తెలియది, తాను మాత్రం ‘బిగ్ బాస్' షో చేయడం లేదని ట్విట్టర్ ద్వారా తేల్చేశారు అనసూయ.

అంత టైమ్ లేదు: అనసూయ

అంత టైమ్ లేదు: అనసూయ

ప్రస్తుతం తాను టీవీ షోలు, సినిమా కమిట్మెంట్లతో చాలా బిజీగా గడుపుతున్నాను. బిగ్ బాస్ షో కోసం టైమ్ కేటాయించాలనే ఆలోచన కూడా చేయడం లేదు అని అనసూయ స్పష్టం చేశారు.

పొగరు అనుకోవద్దు బాసూ

పొగరు అనుకోవద్దు బాసూ

ఈ మధ్య కాలంలో అనసూయకు కొందరు పెద్ద స్టార్ల సినిమాల్లో అవకాశాలు రావడం, వాటిలో కొన్నింటిని తిరస్కరించడం, కొన్ని ఒప్పుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని సార్లు ఆమెకు పొగరు అంటూ నెగెటివ్ ప్రచారం జరిగింది. ‘ప్రస్తుతం బిగ్ బాస్ షో కోసం టైమ్ కేటాయించాలనే ఆలోచన కూడా చేయడం లేదు' అనే అనసూయ మాటను పొగరుగా భావించవద్దని, ఆమె ఉన్న విషయం చెప్పిందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

బిజీ బిజీగా అనసూయ

బిజీ బిజీగా అనసూయ

ఓ వైపు టీవీ షోలు చేస్తూనే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, స్పెషల్ రోల్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది అనసూయ. ప్రస్తుతం ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘రంగంస్థలం 1985' చిత్రంలో నటిస్తోంది.

మంచు లక్ష్మి స్పందించాల్సి ఉంది

మంచు లక్ష్మి స్పందించాల్సి ఉంది

మొత్తానికి యాంకర్ అనసూయ బిగ్ బాస్ రూమర్స్ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చేసింది. మరి మంచు లక్ష్మి ఈ షోలో ఎంట్రీ ఇస్తుందా? లేదా? అనే విషయం తేలాల్సి ఉంది.

English summary
"Umm..Laksmi garu..i dont know I dont think I can afford that time to #BigBossTelugu ..i am hands full with prior TV and movie commitments," Anasuya tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu