»   » సినిమాలే వద్దన్న వ్యక్తి.....‘మూవీ మొఘల్’ ఎలా?

సినిమాలే వద్దన్న వ్యక్తి.....‘మూవీ మొఘల్’ ఎలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డాక్టర్ డి. రామానాయుడు.....భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ నిర్మాత. ఇంగ్లీషుతో సహా 13 బాషల్లో దాదాపు 150 సినిమాలు నిర్మించిన ఆయన శాతాధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నారు. భారత ప్రభుత్వం ఆయన్ను సినీ రంగంలో అత్యున్నత పురస్కారం అయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. సినీ నిర్మాణ రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుతూ ‘మూవీ మొఘల్'గా చరిత్రకెక్కారు.

సినిమా రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరిన రామానాయుడు....ఒకప్పుడు సినిమాల వైపే రావద్దనుకున్నారంటే నమ్మగలరా? ఆయన ఆలోచన మారడానికి, ఈ రంగం వైపు రావడానికి దోహదం చేసిన అంశాలపై ఓ లక్కేద్దాం...

అప్పటికే స్టార్ హీరోహీరోయిన్లయిన అక్కినేని నాగేశ్వర్ రావు, సావిత్రిలు జంటగా నటించిన 'నమ్మినబంటు' సినిమా షూటింగ్.. ఎండ్ల పందాల దృశ్యం చిత్రీకరిస్తున్నారు. సరదాగా ఆ సీన్లో నటించారు రామానాయుడు. తానున్న పరిసరాల్లో హడావిడిగా అటూఇటూ తిరుగుతూ హుషారుగా కనిపించే రామానాయుణ్ణి చూసి 'మీరూ సినిమాల్లోకి ఎందుకు రాకూడదు?' అని అడిగారట ఏఎన్నార్. అయితే తనకు వ్యవసాయం తప్ప వేరే ఆలోచనలేవీ లేవని బదులిచ్చారు నాయుడు.

How Ramanaidu became Movie Mughal

ఈ ఘటన జరిగిన మూడేళ్లకి అంటే 1963 నాటికి రామానాయుడు నిర్మాతగా తన తొలిసినిమా 'అనురాగం'నిర్మించారు. అసలు సినిమాలే వద్దనుకున్న వ్యక్తి నిర్మాతగా ఎందుకు మారారు? ఆద్యంతం సినిమా స్టోరిని తలపించేదే అదీనూ. రైస్ మిల్లుల వ్యాపారంలో రామానాయుడు దూసుకుపోతున్న సమయంలో హఠాత్తుగా సేల్స్ టాక్స్ వాళ్ల వల్ల ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో లక్షల రూపాయలు జరిమాన కట్టాల్సి వచ్చేది. దీంతో విసుగు చెందిన ఆయన మిల్లుల్ని మూసేసి చెన్నపట్నం బాటపట్టారు.

మహాబలిపురం రోడ్డులో పొలం కొన్నారు. కాలక్షేపం కోసం ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కు వెళ్లేవారు. అక్కడే సినిమా వాళ్లతో పరిచయం పెరిగింది. ఇద్దరు స్నేహితులతో కలసి తొలిసినిమా అనురాగం (జగ్గయ్య, భానుమతి హీరోహీరోయిన్లు) నిర్మించారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. డబ్బు వృధా చేయనని తండ్రికిచ్చిన మాటను అనుక్షణం గుర్తుచేసుకుంటూ 1965లో సొంత నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 'రాముడు-భీముడు' సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ మాసివ్ యాక్షన్, తాపి చాణక్య దర్శకత్వ ప్రతిభ తోడవ్వడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో వెనక్కి తిరిగిచూసుకునే పరిస్థితిరాలేదు రామానాయుడుకు.

రాముడు బీముడు హిట్ తర్వాత ఎన్నో పరాజయాలు చవి చూసారు రామానాయుడు. అక్కినేనితో తీసిన సిపాయి చిన్నోడు ఫెయిల్ అయింది. పోయిన చోట వెతుక్కోవాలని మళ్లీ ప్రేమ్ నగర్ సినిమా మొదలు పెట్టారు. ఒక వేళ ఈ సినిమా ప్లాపయితే వెనక్కి వెళ్లి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఆయనన్ను నిర్మాతగా నిలబెట్టింది. మూవీ మోఘల్ అయ్యేందుకు కారణమైన సినిమా ఇదే...

English summary
Check out How Ramanaidu became Movie Mughal.
Please Wait while comments are loading...