హృతిక్ రోషన్‌కి 25,000 ఫైన్
ముంబై: బాలీవుడ్ నటుడుహృతిక్ రోషన్ రీసెంట్ గా తన 42వ పుట్టినరోజు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ముంబయిలోని వోర్లి ప్రాంతంలో ఉన్న ఫోర్ సీజన్స్ హోటల్‌లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. అయితే రాత్రి 10గంటల ప్రాంతంలో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ పెట్టేసరికి హోటల్ ముందు నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు పట్టించుకోకపోయేసరికి హోటల్ బయట బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పార్టీకి ఎందరో ప్రముఖులు వస్తారని ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని సిబ్బంది తెలిపారు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులు హోటల్‌కి చేరుకుని ఎక్కువ సౌండ్ పెట్టినా మేనేజర్ పట్టించుకోలేదని జరిమానా విధించారు.

అనంతరం హోటల్ యాజమాన్యం హృతిక్‌కి రూ.25,000 జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీకి వచ్చిన వాళ్లలో కొందరిని అనుమతించలేదని అందుకే కక్షతో ఇదంతా కావాలని చేస్తున్నారని హృతిక్ మీడియా ప్రతినిధి తెలిపారు.


Click it and Unblock the Notifications











