»   » కొరటాల శివ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్

కొరటాల శివ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తొలి సినిమా ‘మిర్చి'తో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిన కొరటాల శివ ‘శ్రీమంతుడు' చిత్రంతో భారీ విజయాన్ని నమోదు చేసారు. అంతే కాదు త్వరలో ఆయన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో సినిమా చేయబోతున్నారు. తెలుగులో హిట్టయిన ‘శ్రీమంతుడు' చిత్రాన్ని బాలీవుడ్లో హృతిక్ రోషన్ తో రీమేక్ చేయబోతున్నాడు.

ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి కొరటాల శివ సంయుక్తంగా ‘శ్రీమంతుడు' రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే హృతిక్ రోషన్ కి కథ వినిపించాడని, అతను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... తెలుగులో జగపతిబాబు పోషించిన హీరో తండ్రి పాత్రను బాలీవుడ్లో స్వయంగా హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ తో చేయించాలనే ఆలోచనలో ఉన్నారట.


Hrithik Roshan in Hindi remake of Srimanthudu

ప్రస్తుతం అటు హృతిక్ రోషన్, ఇటు కొరటాల శివ ఎవరి ప్రాజెక్టులో వారు జిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్ అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ‘మొహంజోదారో' చిత్రం చేస్తుండగా, కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని జనా గ్యారేజ్ అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత హృతిక్ రోషన్ తో శ్రీమంతుడు బాలీవుడ్ రీమేక్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


ఇక ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. ఎన్నో సంవత్సరాల గా ఎన్టీఆర్ ను ఎలా చూడాలి అనుకుంటున్నానో, అలా అయన క్యారెక్టర్ ను తీర్చిదిద్దాను అని అంటున్నాడు దర్శకుడు.

English summary
film Nagar source said that, Hrithik Roshan is likely to reprise Telugu Superstar Mahesh Babu in the Hindi remake of Srimanthudu. The latest buzz is that writer-director Koratala Siva who originally made movie in Telugu, is expected to helm the Hindi remake as well.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu