»   » ఆర్నాల్డ్ ఔట్ : రజనీ రోబో-2లో విలన్‌గా స్టార్ హీరో!

ఆర్నాల్డ్ ఔట్ : రజనీ రోబో-2లో విలన్‌గా స్టార్ హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు శంకర్ గానీ, సూపర్ స్టార్ రజనీ కానీ ఇప్పటివరకూ ఒక్క ముక్క కూడా రోబో 2 గురించి అఫీషియల్ గా మాట్లాడలేదు. అయినా వార్తలు మాత్రం ఆగటం లేదు. అఫిషీయల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేలోగా ఈ చిత్రం గురించి వచ్చే వార్తలతో ఓ పుస్తకం వేసేయచ్చు అని సినీ వర్గాల్లో వినపడుతోంది.

రజనీకు ఆపోజిట్ గా హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ నటించనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గెర్ పెట్టిన కండీషన్లు...అతని భారీ రెమ్యూనరేషన్, షూటింగుకు సరిపడా డేట్స్ ఇవ్వక పోవడంతో దర్శకుడు శంకర్ తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం.

 Hrithik Roshan to play villain in Rajinikanth Robo 2

ఆర్నాల్డ్ బదులు... ఇండియన్ స్టార్ హీరోను తీసుకోవాలనే ప్లాన్లో ఉన్నారు. ఇందుకోసం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అతడియితే సినిమాకు బాలీవుడ్లోనూ మంచి మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్ల ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ' సినిమాలో హీరోయిన్ గా చేసిన అమీ జాక్సన్....‘రోబో-2'లో కూడా కనిపించబోతోందట. ఇందులో ఆమె ఆడ రోబోగా కనిపించబోతోందని అంటున్నారు. సినిమా రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ప్రారంభం కావాల్సి ఉన్నా చెన్నై భారీ వరదల కారణంగా ఆగిపోయింది. త్వరలోనే సినిమాను ప్రారంభించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

English summary
Rajinikanth and Shankar’s Robot-2 are in talks with Hollywood star Arnold Schwarzenegger to play the villain in the movie. But now for some reason, that is not happening now.According to the reports emerging from Kollywood, the makers are in talks with Bollywood Star, Hrithik Roshan to replace him.
Please Wait while comments are loading...