»   » కోర్టులో విడాకులు ఫైల్ చేసిన హృతిక్ రోషన్, సుజానె

కోర్టులో విడాకులు ఫైల్ చేసిన హృతిక్ రోషన్, సుజానె

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఆయన భార్య సుజానె నిరుడు డిసెంబర్లో విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా వీరు అఫీషియల్‌గా విడాకుల కోసం బాంద్రా ఫ్యామిలీ కోర్టను ఆశ్రయించారు. ప్రేమించి వివాహం చేసుకున్న వీరు 13 ఏళ్ల పాటు అన్యోన్య దాంపత్యం సాగించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అనంతరం వచ్చిన అభిప్రాయ బేధాలతో 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు.

చిన్నతనం నుండే సుజానెను ప్రేమిస్తున్న హృతిక్ డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో తన ప్రేయసి సుజానెను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు. హ్రెహాన్, హృదాన్. 'సుజానె నా నుండి విడిపోవాలని కోరుకుంటోంది, నాతో ఉన్న 17 ఏళ్ల బంధాన్ని తెంచుకోవాలని కోరుకుంటోంది. మా ఫ్యామిలీ మొత్తానికి ఇది చాలా కఠినమైన సమయం. మా ప్రైవసీకి కేటాయించాలని మీడియా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను' అంటూ 39 ఏళ్ల హృతిక్ రోషన్ ఆ మధ్య మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

Hrithik Roshan, Sussanne file for divorce

కాగా....ఈ పరిణామాల నేపథ్యంలో హృతిక్ రోషన్ తన భార్యకు రూ. 100 కోట్ల విడాకులు సెటిల్మెంట్ కింద చెల్లించనున్నాడనే వార్తలు బాలీవుడ్లో ఊపందుకున్నాయి. భర్త ఆస్తిలో భార్యకు వాటా లభిస్తుంది కాబట్టి ఈ మేరకు ఈ డీల్ ఓకే అయినట్లు జాతీయ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై మనస్థాపం చెందిన సుజానె రోషన్....మీడియా తీరుపై ఫైర్ అయ్యారు. 100 కోట్ల డైవర్స్ సెటిల్మెంట్ అనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇది పూర్తిగా ఆధారం లేని వార్తలే అని ఆమె తేల్చి చెప్పారు. ఈ వార్తలు తనను ఎంతో బాధించాయని ఆమె చెప్పుకొచ్చారు.

English summary
Hrithik Roshan and Sussanne, who mutually separated in December, last year, have now filed for divorce at a family court in Bandra, here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu